Begin typing your search above and press return to search.
60 ఏళ్లు వచ్చాక ఈ 20రోజులు మర్చిపోలేను!
By: Tupaki Desk | 21 Aug 2022 9:30 AM GMTలైగర్ చిత్రాన్ని పాన్ ఇండియా హిట్టుగా మలిచేందుకు ఏ ఒక్క అవకాశాన్ని విజయ్ వదిలిపెట్టడం లేదు. ఈ మూవీకి అటు ఉత్తరాదిన అద్భుతమైన ప్రచారం చేసుకున్నాడు. ఇంతలోనే తెలుగు రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలతో హీట్ పెంచేస్తున్నాడు.
ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి గుంటూరు మోతడక లోని చలపతి ఇంజనీరింగ్ కాలేజీ లో ఘనంగా జరిగింది. ఈ వేదికపై విజయ్ దేవరకొండ మాట్లాడుతూ బోలెడన్ని పంచ్ లు విసిరాడు. నిజానికి పూరి గారు స్టోరీ చెప్పిన వెంటనే మైండ్ బ్లాక్ అయిందని పోకిరి మార్క్ డైలాగ్ తో అదరగొట్టాడు. ఇలాంటి స్టోరీ కోసం ఎంతైనా కష్టపడాల్సిందే అని ఎన్నో రోజుల పాటు డైట్ మెయింటెయిన్ చేస్తూ వర్కౌట్స్ చేశానని కూడా విజయ్ తెలిపాడు. పూరి ఎంతో శ్రమించారని తన నాయిక అద్భుత పాత్రతో అలరిస్తుందని కూడా కితాబిచ్చాడు. నాకు 60 ఏళ్ళు వచ్చాక కూడా లైగర్ కోసం నేను గడిపిన ఈ 20 రోజులు ఎప్పటికీ మర్చిపోలేనని విజయ్ పంచ్ విసిరాడు.
ఫ్యాన్ కి ప్రత్యేకంగా థాంక్స్ చెప్పిన విజయ్ ఇక మూవీ కి పని చేసిన ప్రతి ఒక్క యాక్టర్ టెక్నీషియన్ కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపాడు. థియేటర్లలో సినిమాని వీక్షించాల్సిందిగా అభిమానులను కోరాడు.
ఎన్నడూ లేనంత వ్యతిరేకత..?
లాల్ సింగ్ చద్దా-పఠాన్ తర్వాత నెటిజనులు విజయ్ దేవరకొండ నటించిన `లైగర్`ను బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. బాలీవుడ్ బహిష్కరణ ఉద్యమం దక్షిణాది చిత్ర పరిశ్రమలోను ప్రతిధ్వనిస్తోంది. విజయ్ దేవరకొండ నటించిన లైగర్ ట్రెండ్ తాజా లక్ష్యంగా మారింది. కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ సమర్పణలో పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించి నిర్మించిన లైగర్ ఆగస్ట్ 25 న విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే అంతకు ముందే #BoycottLigerMovie ట్విట్టర్ లో ట్రెండ్ అవుతోంది. లైగర్ నిషేధానికి నెటిజనులు రకరకాల కారణాలను పేర్కొంటున్నారు. ప్రధానంగా తెలుగు సినిమాను బహిష్కరించడానికి కారణం కరణ్ జోహార్ ప్రమేయం కలిగి ఉండడమే.
తెలుగు బెల్ట్ లోనూ దీనిపై డిబేట్ పీక్స్ కి చేరుతోంది. మీరు KJOతో లేదా బుల్లివుడ్ (వ్యంగ్యం) కు చెందిన మాఫియాతో కలిసి ముందుకు వెళితే నిషేధిస్తామని లైగర్ కి ఒక నెటిజన్ వార్నింగ్ ఇచ్చాడు. ``ప్రియమైన విజయ్‌కి ప్రజలు ఎందుకు బహిష్కరిస్తారో తెలియదు. ఎందుకంటే బాలీవుడ్ ఎల్లప్పుడూ మన సంస్కృతిని అగౌరవపరుస్తుంది. బాలీవుడ్ నటుడు ఎల్లప్పుడూ ప్రజలను బాధించే స్టేట్ మెంట్ లను ఇస్తుంటారు. ప్రజల ఆదరణతోనే ఒక వ్యక్తి తనను తాను స్టార్ అని పిలుచుకుంటాడు! కానీ ఇప్పుడు ప్రజలను బాధించేవారికి అండగా నిలవొద్దు! అని ఒక నెటిజన్ అన్నారు.
లాల్ సింగ్ ఛద్దా-రక్షా బంధన్-దోబారా సహా ఇంకా విడుదల చేయని `పఠాన్` ని కూడా నిషేధించాలని ట్విట్టర్ లో ట్రెండ్ కొనసాగుతోంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా చిత్రాన్ని ప్రజలు బహిష్కరించడం సరికాదని విజయ్ దేవరకొండ అన్నారు. ఒక సినిమా సెట్ లో నటీనటులు దర్శకులే కాకుండా ఇంకా చాలా ముఖ్యమైన పాత్రలు ఉంటాయని నటీనటులు సిబ్బంది సహా 200-300 మంది సినిమాకి పనిచేస్తున్నారని చెప్పారు. ఒక సినిమా చాలా మందికి ఉపాధిని ఇస్తుందని విజయ్ అన్నారు.
లాల్ సింగ్ చిత్రంలో నటించేది అమీర్ ఖాన్.. కానీ 2000-3000 కుటుంబాలకు అది బతుకును నడిపిస్తుందని కూడా విజయ్ ఆవేదన చెందాడు. సినిమాను బహిష్కరించాలని భావిస్తే మీరు అమీర్ ఖాన్ ను మాత్రమే ప్రభావితం చేయరు.. జీవనోపాధిని కోల్పోతున్న వేలాది కుటుంబాలను ప్రభావితం చేస్తున్నారు... అని కూడా విజయ్ అన్నారు.
లైగర్ గురించి మాట్లాడుతూ.. కోవిడ్-19 కారణంగా అనేక వాయిదాల తర్వాత మేకర్స్ ప్రస్తుతం పూర్తి స్వింగ్ లో చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్ - పాటలను ఆకట్టుకున్నాయి. పాటలకు బాయ్ కాట్ ట్రెండ్ ని అనువర్తించారు. ఈ చిత్రం హిందీ చిత్రసీమలో విజయ్ ఆరంగేట్ర చిత్రం కావడంతో అక్కడ పెద్ద సందడి నెలకొంది.