Begin typing your search above and press return to search.
నెగటివ్ రోల్ లో విజయ్ దేవరకొండ
By: Tupaki Desk | 11 March 2018 2:07 PM GMTఅర్జున్ రెడ్డి పుణ్యమా అని విజయ్ దేవరకొండ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతోంది. రీసెంట్ గా తమిళ్ లో కూడా లాంచ్ అవుతున్న విజయ్ కొత్త సినిమా నోటా ఇటీవలే షూటింగ్ ప్రారంభించుకున్న సంగతి తెలిసిందే. దర్శకుడు ఆనంద్ శంకర్ చెప్పిన దాని ప్రకారం నోటాలో విజయ్ దేవరకొండ క్యారెక్టర్ లో నెగటివ్ షేడ్స్ ఉంటాయట. కాని వాటి తీరుతెన్నులు మాత్రం బయటికి చెప్పలేదు ఆనంద్ శంకర్. కోలీవుడ్ టాక్ ప్రకారం నోటా ఒక పొలిటికల్ థ్రిల్లర్. సస్పెన్స్ మైంటైన్ చేస్తూ ఊహించని మలుపులతో కథను నడపటంలో ఆనంద్ శంకర్ మాస్టర్. అతని మొదటి సినిమా ఇరిమ నంబి అక్కడ బ్లాక్ బస్టర్ హిట్. అదే తెలుగులో డైనమైట్ గా రీమేక్ చేసారు కాని ఇక్కడ వర్క్ అవుట్ అవ్వలేదు. రెండో సినిమా విక్రం హీరోగా వచ్చిన ఇంకొక్కడు కమర్షియల్ గా గొప్ప విజయం సాధించకపోయినా టేకింగ్ పరంగా మాత్రం అందరి మెప్పు పొందింది.
విజయ్ దేవరకొండ నోటా ఒప్పుకోవడానికి కారణం కూడా గతంలో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ వచ్చిన ఏ సినిమాలోనూ లేని ప్రత్యేకత ఇందులో ఉండటమేనట. మొదట నెగటివ్ గా అనిపించినా దాని వెనుక సహేతుక కారణం ఉంటుందని, ఎన్నికల వ్యవస్థను మార్చడానికి నడుం బిగించిన ఒక యువకుడి కథగా నోటా ఉంటుందని తెలిసింది. విజయ్ దేవరకొండకు తమిళ్ లో ఇదే డెబ్యు మూవీ అవుతుంది. తన ల్యాండ్ మార్క్ సినిమా అర్జున్ రెడ్డి విక్రం కొడుకు ధృవ్ తో రీమేక్ చేస్తున్నారు కాబట్టి కనీసం డబ్బింగ్ చేసుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. అందుకే నోటాతో బలమైన ఎంట్రీ ఇచ్చే ప్లాన్ లో ఉన్నాడు విజయ్ దేవరకొండ.
టాక్సీ వాలా మేలో విడుదల కానుండగా పరశురాం దర్శకత్వంలో చేస్తున్న సినిమా ఏడాది చివరిలో ఉండొచ్చు. ఆఫీసర్ తర్వాత తనకో సినిమా చేయమని వెంటపడుతున్న వర్మను విజయ్ దేవరకొండ డేట్స్ ఖాళీ లేవనే కారణంతో స్మార్ట్ గా తప్పించుకుతిరుగుతున్నట్టు టాక్. భవిష్యత్తు సూపర్ స్టార్ విజయ్ దేవరకొండే అని వర్మ అర్జున్ రెడ్డి టైం లో పొగడ్తలతో ఆకాశానికేత్తేసాడు. కాని పాపం అవి ఇప్పుడు ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి.