Begin typing your search above and press return to search.
ఈసారి రౌడీ గారు చొక్కా విప్పి 6-ప్యాక్?
By: Tupaki Desk | 13 Aug 2019 11:39 AM ISTపరిశ్రమలో స్టార్లను మలిచే దర్శకులకు ప్రత్యేకమైన గుర్తింపు గౌరవం ఉంటాయనడంలో సందేహం లేదు. మాస్ కమర్షియల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కి ఆ గుర్తింపు ఉంది. ఎవరైనా ఒక కొత్త కుర్రాడిని పరిచయం చేయాలంటే పూరి అయితేనే కరెక్ట్ అనే భావన స్టార్ స్టడ్ ఫ్యామిలీస్ కి ఇప్పటికీ ఉంది. మాస్ ప్రేక్షకులకు హీరోని చేరువ చేయగలిగే సత్తా ఉన్న స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ అని నమ్మారు కాబట్టే రామ్ చరణ్ .. బన్ని.. ప్రభాస్ లాంటి స్టార్లు కెరీర్ ఆరంభమే ఆయన దర్శకత్వంలో నటించారు. చిరుతనయుడు చరణ్ డెబ్యూ చేసింది పూరి దర్శకత్వంలోనే కాబట్టి ఆ గౌరవం ప్రేమ ఇప్పటికీ మెగా కాంపౌండ్ కి ఉన్నాయి. బన్నిని కెరీర్ ఆరంభమే `దేశముదురు`గా తీర్చిదిద్దిన ఘనుడు అన్న గౌరవం అల్లు కాంపౌండ్ కి ఉంది. డార్లింగ్ ప్రభాస్ ని బుజ్జిగాడిగా మలిచిన ఘనత ఆయనదే. అందుకే ఆయనను స్టార్లను మలిచిన యుగ పురుషుడుగానే గౌరవిస్తారు అభిమానులు.
బన్ని- దేశముదురు.. ప్రభాస్ -బుజ్జిగాడు.. ఎన్టీఆర్- టెంపర్.. కళ్యాణ్ రామ్- ఇజం .. ఈ సినిమాల్లో సదరు హీరోల్ని కొత్త లుక్ తో చూపించడంలో పూరి ప్రయత్నాన్ని ఎవరూ అంత తేలిగ్గా మర్చిపోలేదు. ఫిజికల్ గా లుక్ మార్చేయడమే కాదు హీరోలతో నటన పరంగానూ ఎంతో హార్డ్ వర్క్ చేయించారు పూరి. కొత్తగా ప్రెజెంట్ చేసేందుకు ఆయన ఎంతో చేశారు. అందుకే ఆయనంటే హీరోలందరికీ ప్రత్యేకమైన గౌరవం. ఇటీవల వరుస పరాజయాలు ఇబ్బంది పెట్టాయి. ఎట్టకేలకు ఎనర్జిటిక్ రామ్ ని `ఇస్మార్ట్ శంకర్` గా చూపించి విజయం అందుకున్నారు. ఈ సినిమా కోసం రామ్ వేషాన్ని అంతే గొప్పగా మార్చేసిన పూరి తాను అనుకున్నది సాధించుకున్నారు. తిరిగి పూరి 2.0 గా రీబూట్ అయ్యారు.
ఇలాంటి టైమ్ లో నవతరం హీరో విజయ్ దేవరకొండ పూరి దర్శకత్వంలో నటిస్తున్నారు అనగానే అభిమానుల్లో క్యూరియాసిటీ పెరిగింది. నైజాం యాసతో ఒరిజినాలిటీని చూపించేందుకు ఇష్టపడే దేవరకొండను పూరి ఎలా చూపించబోతున్నారు? అతడి బాడీ లాంగ్వేజ్ ని ఎలా మార్చేయబోతున్నారు? ఇస్మార్ట్ రామ్ తరహాలోనే రౌడీని కూడా అంతే మాసీగా సంథింగ్ స్పెషల్ గా చూపించబోతున్నారా? అంటూ ఎవరికి వారు గెస్సింగ్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండని మాస్ హీరోని చేసే ప్రయత్నమేనా ఇది? అతడు చొక్కా విప్పి 6 ప్యాక్ చూపిస్తాడా? అంటూ ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు. మరి వీటన్నిటికీ పూరి కానీ.. దేవరకొండ కానీ సమాధానం చెప్పాల్సి ఉంటుంది.