Begin typing your search above and press return to search.
రొమాంటిక్ హీరో కళ్లు ఎరుపెక్కాయి
By: Tupaki Desk | 26 Sep 2018 10:48 AM GMT‘పెళ్లి చూపులు’ చిత్రంతో క్లాస్ హీరో ఇమేజ్ ను దక్కించుకున్న విజయ్ దేవరకొండ ఆ తర్వాత నటించిన ‘అర్జున్ రెడ్డి’ మరియు ‘గీత గోవిందం’ చిత్రాలతో రొమాంటిక్ హీరో ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. లేడీస్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పొందిన విజయ్ దేవరకొండ తన తదుపరి చిత్రం ‘నోటా’లో చాలా సీరియస్ పాత్ర పోషించినట్లుగా తాజాగా విడుదలైన పోస్టర్ తో అనిపిస్తుంది. తెలుగు మరియు తమిళంలో ఒకేసారి తెరకెక్కి - అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘నోటా’ చిత్రంలో కొత్త విజయ్ దేవరకొండను చూడబోతున్నట్లుగా అనిపిస్తుంది.
‘నోటా’లో కొన్ని సీన్స్ లో విజయ్ దేవరకొండ సీఎంగా కనిపించబోతున్నట్లుగా ట్రైలర్ చూస్తుంటే అర్థం అవుతుంది. ఆ సీన్స్ లో విజయ్ చాలా సీరియస్ గా కనిపించబోతున్నాడని పై ఫోస్టర్ ను బట్టి తెలుస్తోంది. ఇప్పటి వరకు ప్రేమను కురిపించి - రొమాంటిక్ చూపులు చూసిన విజయ్ దేవరకొండ కళ్లు ఇప్పుడు నిప్పులు కక్కుతున్నాయి. ఎరుపెక్కిన కళ్లతో ఈ పోస్టర్ లో విజయ్ చాలా సీరియస్ గా కనిపిస్తున్నాడు. తన గత చిత్రాల్లో తాను పోషించిన పాత్రలకు పూర్తి విరుద్దంగా ఉండే పాత్రను విజయ్ ‘నోటా’లో పోషించినట్లుగా తెలుస్తోంది.
‘నోటా’ చిత్రాన్ని ఆనంద్ శంకర్ దర్శకత్వంలో జ్ఞానవేల్ రాజా నిర్మించాడు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘భరత్ అనే నేను’ మరియు అంతకు ముందు వచ్చిన పలు సినిమాలు కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అందుకే ఈ చిత్రం కూడా తప్పకుండా విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం సినీ వర్గాల్లో వ్యక్తం అవుతుంది. ఇక ఈ చిత్రంతో విజయ్ దేవరకొండ తమిళంలో గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇప్పటి వరకు తెలుగు హీరోలు అక్కడ పెద్దగా రాణించిన సందర్బాలు లేవు. మరి ఈ చిత్రంతో విజయ్ అక్కడ ఏ స్థాయిలో రాణిస్తాడో చూడాలి.