Begin typing your search above and press return to search.
పవన్ తరువాత ఇండస్ట్రీకి దొరికిన యూత్ ఫుల్ స్టార్ విజయ్ దేవరకొండ:దిల్ రాజు
By: Tupaki Desk | 21 Oct 2021 3:03 AM GMT'రౌడీ బాయ్స్' సినిమాకి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. నిన్నరాత్రి జరిగిన సాంగ్ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా విజయ్ దేవరకొండ వచ్చాడు. వేదికపై దిల్ రాజు మాట్లాడుతూ .. "ఈ సినిమాకి 'రౌడీ బాయ్స్' టైటిల్ అనుకున్నప్పుడు, విజయ్ దేవకొండను కలిశాను. ఆయన ఫ్యాన్స్ ను రౌడీ బాయ్స్ అంటారా అని అడిగాను .. 'కాదు సార్ 'రౌడీస్' అంటారు' అని చెప్పాడు. అలా ఆయన నుంచి క్లారిటీ వచ్చాక ఈ సినిమాకి 'రౌడీ బాయ్స్' అనే టైటిల్ పెట్టాను. ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ యూత్ కంటెంట్. ఈ సినిమా నుంచి వచ్చిన ఒక టీజర్ .. సాంగ్ మీరు చూసి ఉంటారు. ఈ కథ కాలేజ్ నేపథ్యంలో జరుగుతుందనే విషయం మీకు అర్థమైపోయే ఉంటుంది.
విజయ్ కి .. నాకు మధ్య చిన్నపాటి జర్నీ ఉంది .. చాలా విచిత్రమైన జర్నీ మాది. విజయ్ 'కేరింత' సినిమాలో ముగ్గురు హీరోల్లో ఒకరిగా ఫొటో షూట్ చేయడానికి వచ్చాడు. అపుడు ఆయనను నేను డైరెక్ట్ గా కలవలేదు. 'పెళ్లి చూపులు' సినిమాను ఆయన నాకు చూపించడానికి ట్రై చేశాడుగానీ, అప్పుడు నేను ఆస్ట్రేలియాలో ఉన్నాను. అందువలన ఆ సినిమాను రిలీజ్ చేయలేకపోయాము. ఆ తరువాత 'అర్జున్ రెడ్డి' .. 'గీత గోవిందం' సినిమాలతో హిట్లు అందుకున్నాడు. 'గీత గోవిందం' ఫంక్షన్ కి నేను వెళ్లాను.
ఆ ఫంక్షన్ కి విజయ్ వస్తుంటే మీ రౌడీస్ అంతా అక్కడే ఉన్నారు. అప్పుడు నేను ఒక్కటే చెప్పాను. నా 25 ఏళ్ల కెరియర్లో నేను చూశాను .. పవన్ కల్యాణ్ గారికి ఫ్యాన్స్ దొరికారు. చాలా తక్కువ సమయంలో .. రెండు మూడు సినిమాలతోనే ఆ రేంజ్ లో యూత్ ని విజయ్ ప్రభావితం చేశాడు. నెక్స్ట్ తెలుగు ఇండస్ట్రీకి పవన్ కల్యాణ్ లా ఓ యూత్ ఫుల్ స్టార్ దొరికాడని నేను ఆ రోజునే చెప్పాను. నాలుగు సినిమాలతోనే విజయ్ స్టార్ గా ఎదిగాడు. ఈ రోజున పాన్ ఇండియా హీరోగా 'లైగర్' తో ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. అలాంటి విజయ్ నేను అడగగానే మా ఈవెంట్ కి వచ్చినందుకు థ్యాంక్స్ చెబుతున్నాను.
ఇక 'రౌడీ బాయ్స్' విషయానికి .. ఇక్కడ ఇంతమంది రౌడీస్ ఉన్నారు .. అందరూ కొత్తవాళ్లే. ఆల్మోస్ట్ అందరినీ కొత్తవాళ్లనే తీసుకున్నాము. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. ఆల్రెడీ రెండు పాటలు మీరు విన్నారు. మిగతావి నాలుగైదు రోజులకు ఒకటి చొప్పున వదులుతాము. అనుపమ పరమేశ్వరన్ విషయానికి వస్తే మా బ్యానర్లో ఆమెకి 3వ సినిమా. అందరూ కొత్తవాళ్లే కావడంతో తను కూడా ఒక కొత్త అమ్మాయిగానే ఒదిగిపోయి ఈ సినిమా చేసింది. మా కోసం డేట్స్ ఎడ్జస్ట్ చేసి చాలా హెల్ప్ చేసింది .. అందుకు ఆమెకి థాంక్స్ చెబుతున్నాను.
ఈ సినిమాను దసరాకి విడుదల చేయాలనుకున్నాము కానీ కుదరలేదు. దాంతో నవంబర్ 19వ తేదీన విడుదల చేస్తున్నాము. యూత్ అందరినీ థియేటర్లో శాటిస్ ఫై చేస్తామనే నమ్మకంతో ఈ సినిమా రెడీ చేశాము. సంగీతం పరంగా గానీ .. డాన్స్ పరంగా గాని .. ఎంటర్టైన్మెంట్ పరంగాగాని యూత్ ను ఆకట్టుకుంటుంది. దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేస్తున్నందు వలన రాలేకపోయాడు. ఈ సినిమాకి ఆయన ఇచ్చిన ఆల్బమ్ సక్సెస్ ఫుల్ ఆల్బమ్ గా నిలుస్తుందనే నమ్మకం ఉంది" అని చెప్పుకొచ్చాడు.