Begin typing your search above and press return to search.

రౌడీ గారిని బుట్ట‌లో వేసిన కియ‌రా.. అస‌లేం జ‌రుగుతోంది?

By:  Tupaki Desk   |   30 Oct 2020 5:40 PM GMT
రౌడీ గారిని బుట్ట‌లో వేసిన కియ‌రా.. అస‌లేం జ‌రుగుతోంది?
X
పెళ్లి కూతురిలా సిగ్గు ప‌డుతున్న రౌడీ గారితో కియ‌రా ప‌రాచికం చూశారా? క‌లిసి తింటే ప్రేమ పెరుగుతుంది!! అంటూ బుట్ట‌లో వేసేస్తోంది అత‌గాడిని. వామ్మోవ్ ఆ ఇద్ద‌రి మ‌ధ్యా ఏం జ‌రుగుతోంది? ఏదో వ్య‌వ‌హారం డీప్ గానే సాగుతోందన్న సందేహం ఈ వీడియో చూసిన వారికి క‌లుగుతోంది.

ఇది మెబాజ్ యాడ్. దీనికోసమే క‌దా అప్ప‌ట్లో కియ‌రా- దేవ‌ర‌కొండ జోడీకి ఫోటోషూట్ ని కూడా చేశారు. ఓవైపు కోవిడ్ విల‌య‌తాండ‌వం ఆడ‌టానికి రెడీ అవుతుంటే దేవ‌ర‌కొండ ముంబైకి వెళ్లి చ‌క్క‌ర్లు కొట్టాడు. క‌ర‌ణ్ జోహార్.. మ‌నీష్ మ‌ల్హోత్రా వంటి ప్ర‌ముఖుల‌తో చెలిమి చేసి అటుపై ఫోటోషూట్ల‌తో దుమారం రేపాడు. అయితే అప్ప‌ట్లోనే ఓ యాడ్ షూట్ కోసం దేవ‌ర‌కొండ అక్క‌డ వాలాడన్న సంగ‌తి తెలిసింది త‌క్కువ మందికే.

ఇప్పుడు ఆ ప్ర‌క‌ట‌న బ‌య‌టికి వచ్చిందిలా. ప్ర‌క‌ట‌న బావుంది..అంత‌కుమించి అందు‌లో క‌నిపించిన‌ జంట బావుంది. ఇద్ద‌రికీ జ‌త కుదిరింది. నిజ జీవితంలో కూడా దేవ‌ర‌కొండ‌కు అంతే అంద‌గ‌త్తె అయిన అమ్మాయి దొర‌కాల‌ని ఫ్యాన్స్ తెగ ఇదైపోతున్నారు కూడా ఈ యాడ్ చూశాక‌. ఇక కియ‌రాకి ఫేవ‌రెట్ హీరో ఎవ‌రు? అంటే మ‌న రౌడీగారేన‌ని ఇంత‌కుముందు అంది. కియ‌రాతో పాటు జాన్వీ క‌పూర్ అన‌న్య పాండే కూడా రౌడీ పైనే మ‌న‌సు ప‌డ్డారు మ‌రి. మొత్తానికి భామ‌ల గుండెల్లో వీరుడిలా క‌ల‌ల్లో రాకుమారుడిలా మారాడు మ‌న దేవ‌ర‌కొండ‌. ప్ర‌స్తుతానికి అన‌న్య‌తో క‌లిసి ఫైట‌ర్ చిత్రంలో న‌టిస్తున్న దేవ‌ర‌కొండ కోసం కియ‌రా .. జాన్వీ కూడా వెయిటింగ్.