Begin typing your search above and press return to search.
దేవరకొండ డేరింగ్ డెసిషన్
By: Tupaki Desk | 6 March 2018 11:30 PM GMT‘అర్జున్ రెడ్డి’ సినిమాతో రాత్రికి రాత్రే స్టార్ అయిపోయాడు విజయ్ దేవరకొండ. ఆ సినిమా తర్వాత అతడికి అవకాశాలు వెల్లువెత్తాయి. కేవలం తెలుగులో మాత్రమే కాదు.. ఇతర భాషల్లో కూడా అతడికి ఫాలోయింగ్ వచ్చింది. తమిళ జనాలు ‘అర్జున్ రెడ్డి’ చూసి ఫిదా అయిపోయారు. చాలామంది కోలీవుడ్ సెలబ్రెటీలు ఆ సినిమా చూసి విజయ్‌ను పొగిడారు. అంతే కాదు.. స్టూడియో గ్రీన్ లాంటి ప్రముఖ నిర్మాణ సంస్థ విజయ్ తో తమిళ.. తెలుగు భాషల్లో ద్విభాషా చిత్రం చేయడానికి ముందుకొచ్చింది. ‘అరిమా నంబి’తో దర్శకుడిగా పరిచయమై ఆ తర్వాత విక్రమ్ హీరోగా ‘ఇరుముగన్’ (తెలుగులో ‘ఇంకొక్కడు) తీసిన ఆనంద్ శంకర్ ఈ చిత్రానికి దర్శకుడు.
విజయ్ సరసన మెహ్రీన్ కౌర్ కథానాయికగా నటించే ఈ సినిమా నిన్ననే ప్రారంభోత్సవం జరుపుకుంది. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ ఆసక్తికర విషయం చెప్పాడు. ఈ చిత్రానికి తమిళంలోనూ తానే సొంతంగా డబ్బింగ్ చెప్పుకోనున్నట్లు ప్రకటించాడు. విజయ్ కి నిజానికి తమిళం తెలియదు. తమిళం తెలియని వాళ్లు ఆ భాషలో మాట్లాడటం అంత సులువు కాదు. కానీ విజయ్ మాత్రం తన పాత్రకు డబ్బింగ్ చెప్పించుకోవడానికి ఇష్టపడట్లేదు. తమిళ క్లాసులు పెట్టించుకుని అయినా ఆ భాషపై పట్టు సాధించి సినిమా ముగిసే ముగిశాక డబ్బింగ్ చెప్పుకోవాలని డిసైడయ్యాడు. ఇది డేరింగ్ డెసిషనే. విజయ్ తెలుగు సినిమాతోనే అతడిని మెచ్చిన తమిళ జనాలు.. నేరుగా తమిళంలో నటిస్తూ తమిళంలో డబ్బింగ్ చెబితే మరింతగా అతడిని ఇష్టపడతారేమో.