Begin typing your search above and press return to search.

పేరు `లైగ‌ర్`ది కాసులు సీతారామం..కార్తికేయకి!

By:  Tupaki Desk   |   28 Aug 2022 11:23 AM GMT
పేరు `లైగ‌ర్`ది  కాసులు సీతారామం..కార్తికేయకి!
X
రౌడీస్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా న‌టించిన `లైగ‌ర్` ఈనెల 25న రిలీజ్ అయి ఎలాంటి టాక్ సొంతం చే స‌కుందో తెలిసిందే. తొలిషోతోనే మ్యాట‌ర్ లేని సినిమాగా క్రిటిక్స్ స‌హా ప్రేక్ష‌కులు తేల్చేసారు. సాధార‌ణంగా రేర్ కేసెస్ లో క్రిటిక్స్ అంచ‌నాలు త‌ప్ప‌వుతుంటాయి. అయితే ఈసారి క్రిటిక్స్ తో పాటు..ప్రేక్ష‌కుల అంచ‌నాలు కూడా మ్యాచ్ అయ్యాయి.

`లైగ‌ర్` ని మొద‌టి రోజే డిజాస్ట‌ర్ గా తేల్చేసారు. రౌడీస్టార్ -పూరి బ్రాండ్ బాక్సాఫీస్ వ‌ద్ద ఏమాత్రం వ‌ర్కౌట్ అవ్వ‌డం లేదు. మూడ‌వ రోజు థియేట‌ర్లు పూర్తిగా ఖాళీ అయిన‌ట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ర్టాల‌తో పాటు..హిందీలోనూ ఇదే ప‌రిస్థితి కొన‌సాగుతుంది. శ‌నివారానికి సినిమా పూర్తిగా బాక్సాఫీస్ వ‌ద్ద తేలిపోయింది. టిక్కెట్ తెగ‌డ‌మే క‌ష్టంగా మారింది.

సీతామారం..కార్తికేయ‌-2 సినిమా టిక్కెట్లు దొర‌క‌క‌పోతే లైగ‌ర్ కి వెళ్తున్నారంటే? అర్ధం చేసుకోవ‌చ్చు స‌న్నివేశం ఎంత దారుణంగా ఉంద‌న్న‌ది. ఆర్టీసీ క్రాస్ రోడ్లలో `సీతా రామం` మరియు `కార్తికేయ 2` థియేట‌ర్లు మళ్లీ హౌస్ ఫుల్ అవుత‌న్నాయి. గేట్ బ‌య‌ట హౌస్‌ఫుల్ బోర్డులు క‌నిపిస్తున్నాయి. `లైగర్` చూడాలనుకున్న ప్రేక్షకులు మనసు మార్చుకుని సీతారామం..కార్తికేయ -2 థియేట‌ర్ల‌కి వెళ్లిపోతున్నారు.

లైగ‌ర్ ప‌రాజ‌యం ఈ రెండు హిట్ చిత్రాల‌కు క‌లిసొస్తుంద‌ని చెప్పొచ్చు. పూరి-విజ‌య్ బ్రాండ్ తో కొంత మంది సినిమా చూద్దామ‌ని థియేట‌ర్ వ‌ర‌కూ వ‌స్తున్నారు. ఫీడ్ బ్యాక్ తీసుకుని ఎంచ‌క్కా హిట్ అయిన సినిమాలవైపు జ‌నం మ‌ళ్లుతున్నారు. లైగ‌ర్ ఎపిక్ డిజాస్ట‌ర్ ఈ స‌న్నివేశం చెప్ప‌క‌నే చెబుతుంది. అమెరికాలో లైగర్ శనివారం కేవలం $50k వసూలు చేసింది. మరోవైపు కార్తికేయ 2 $100k కంటే ఎక్కువ వసూలు చేసింది.

క్రాస్ రోడ్స్ వద్ద ఎగ్జిబిటర్లు సోమవారం లైగ‌ర్ తొల‌గించి దాని స్థానంలో ఇతర చిత్రాలతో భర్తీ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. లైగ‌ర్ హైప్‌ని బట్టి నిర్మాతలు అధిక ధరలకు అమ్మడం వల్ల సినిమా డిస్ట్రిబ్యూటర్లకు ఊహించలేని నష్టాలను మిగిల్చిందంటున్నారు. నైజాం డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను పెద్ద చిక్కుల్లో పడ్డట్లు స‌మాచారం. నష్టాలను ఎవరు భరిస్తారు? అని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారుట‌.

ఓ సారి ఈమూడు సినిమాల శ‌నివారం వ‌సూళ్లు చూస్తే.. కార్తికేయ2 స్థూలంగా $91,668 (114 locs) మొత్తం $1,283,876 వసూలు చేసింది.`లైగ‌ర్` $44,730 (341 locs) మొత్తం $711,634 .. `సీతారామం` శనివారం స్థూలంగా $24,382 (35 locs) మొత్తం $1,309,922 వసూలు చేసింది.


మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.