Begin typing your search above and press return to search.
'లైగర్' పంచాయతీ ఛాంబర్ కి చేరిందా?
By: Tupaki Desk | 12 Sep 2022 12:30 AM GMTసినిమా రిలీజ్ అయి హిట్ అయితే అంతా హ్యాపీ. లేదంటే? అన్ని సమస్యలే. డబ్బు చుట్టూ నడిచే ప్రపంచంలో ఇదంతా సహజమే. నష్టపోయిన నిర్మాత నుంచి పంపిణీదారుడు..బయ్యర్ ప్రతీ ఒక్కరూ లబోదిబో మనక తప్పదు. నష్టం లక్షల్లో ఉన్నా..కోట్లలో ఉన్నా? ఆ సమస్యలు తొలగిపోయే వరకూ అంతా భారంగానే కనిపిస్తుంది.
ఆ మధ్య రిలీజ్ అయిన `ఆచార్య` ఇలాంటి సమస్యనే ఎదుర్కొంది. విషయం సీరియస్ కాకుండానే మెల్లగా ఎలాగూ బయ్యర్లకు కార్యాలయంలో సెటిల్ చేసి పంపించినట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. సినిమా వైఫల్యం చెందితే ఫలితం ఎలా? ఉంటుందన్నది దర్శకుడు కొరటాల శివకి తొలిసారి అర్ధమైంది. ప్రస్తుతం `లైగర్` విషయంలో కూడా అలాంటి సన్నివేశమే కనిపిస్తుంది.
ఇటీవల భారీ అంచనాల మధ్య `లైగర్` ప్రేక్షకుల ముందుకొచ్చి వాటిని అందుకోవడంలో విఫలమైన సంగతి తెలిసిందే. పూరి బ్రాండే కావొచ్చు..దేవరొండ ఇమేజ్ నే కావొచ్చు. కారణాలేవైనా బయ్యర్లు మాత్రం తీవ్రమైన నష్టాలు ఎదుర్కున్నారు. దీంతో వివిధ కేంద్రాల్లో పెద్దమొత్తంలో నష్టపోయిన బయ్యర్లు నష్టాన్ని పూడ్చుకునేందుకు ఛార్మిని ఆశ్రయిస్తున్నట్లు మీడియా లో కథనాలొస్తున్న సంగతి తెలిసిందే.
నష్టాల్ని పూరించే బాధ్యత సైతం పూరి-చార్మి తీసు కుంటున్నారని కూడా వెలుగులోకి వచ్చింది. అయితే ఆ తర్వాతే తాము కూడా చాలా నష్టపోయామని.. తిరిగి చెల్లించేందుకు చేతిలో చిల్లి గవ్వ కూడా లేదని తమ బాధ్యని సైతం వ్యక్తం చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. పూరి-చార్మితో సన్నిహితంగా ఉండేవారు తమ సమస్యని విన్నవించుకోగా..వాళ్లకి ఈ రోజు కాకపోయినా తర్వాతైనా పరిష్కారం చూపించే ఛాన్స్ ఉందని..మిగతా వారి పరిస్థితి ఏంటి? అని మరో డౌట్ కూడా రెయిజ్ అయింది.
ఈ నేపథ్యంలో బయ్యర్లు అంతా ఒకేతాటిపైకి వచ్చినట్లు వినిపిస్తుంది. సెడెడ్ బయ్యర్లు సహా అంతా హైదరాబాద్ లోని పూరీ జగన్నాథ్ కార్యాలయంలో కూర్చోని సెటిల్ చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు గుస గుస వినిపిస్తుంది. మరోవైపు ఒక వార్త ప్రకారం పూరి కనెక్ట్స్ కార్యాలయం ఎలాంటి పరిహారం చెల్లించడానికి సిద్దంగా లేదని వినిపిస్తుంది.
దీంతో సమస్య ఫిలిం ఛాంబర్ వరకు వెళ్లిందని తాజా సమాచారం. పూరి కనెక్ట్స్ బ్యానర్ తమ తదుపరి చిత్రం విడుదలకు వ్యతిరేకంగా వడ్డీతో పాటు పెండింగ్ మొత్తాన్ని చెల్లించేలా ఛాంబర్‌పై ఒత్తిడి తీసుకురావాలని బయ్యర్లు ప్లాన్ చేస్తున్నట్లు ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తుంది. దీనిపై అధికారికంగా పూరి కార్యాలయం నుంచిగానీ...బయ్యర్ల నుంచి గానీ ఎలాంటి సమాచారం లేదు.