Begin typing your search above and press return to search.
విజయ్ దేవరకొండ మరో ట్యాగ్ కొట్టేసాడు
By: Tupaki Desk | 4 Feb 2019 3:30 PM GMTపెళ్లి చూపులు లాంటి కూల్ హిట్ వచ్చినపుడు విజయ్ దేవరకొండ ఇంత క్రేజ్ కు చేరుకుంటాడని ఎవరైనా ఊహించారా. అర్జున్ రెడ్డి విజయం కూడా అంచనాలకు అందనిది. పట్టుమని పది సినిమాలు దాటకుండానే రెండు ఇండస్ట్రీ హిట్స్ కొట్టిన విజయ్ దేవరకొండ గీత గోవిందం దెబ్బకు మార్కెట్ ని అమాంతం పెంచేసుకున్నాడు. కేవలం సినిమాల ద్వారానే కాకుండా యాటిట్యూడ్ లో కూడా విభిన్నత ప్రదర్శిస్తూ యూత్ లో ఫాలోయింగ్ పెంచుకుంటున్న ఈ రౌడీ బ్రాండ్ హీరోకు మరో ఘనత వచ్చి చేరింది.
ప్రముఖ పత్రిక ఫోర్బ్స్ తన ఇండియా ఎడిషన్ లో ప్రకటించిన టాప్ 30 లిస్ట్ లో చోటు దక్కించుకున్నాడు. యువ పారిశ్రామిక వేత్తలు ఆయా వృత్తుల్లో కొత్త శిఖరాలకు చేరుకొని స్టాండర్డ్స్ నిర్దేశించిన వాళ్ళను వివిధ రంగాల్లోని అంశాల ప్రాతిపదికన ఎంచుకునే ఫోర్బ్స్ అందులో 29వ స్థానాన్ని విజయ్ దేవరకొండకు ఇవ్వడం ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ ఇచ్చేదే. ఎంటర్ టైన్మెంట్ అండ్ మ్యూజిక్ క్యాటగిరీలో విజయ్ ఈ ఘనతను సాధించాడు.
ప్రస్తుతం డియర్ కామ్రేడ్ లో స్టూడెంట్ లీడర్ గా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీలో ఫ్యాక్టరీ వర్కర్ గా ఒకదానికి ఒకటి సంబంధం లేని పాత్రలు చేస్తున్న విజయ్ వీటి తర్వాత మరో మూడు ప్రాజెక్ట్స్ లైన్ లో పెట్టాడు. ఇప్పటికే రౌడీ బ్రాండ్ తో వస్త్ర వ్యాపారంలో దూసుకుపోతున్న విజయ్ త్వరలో సినిమా నిర్మాణంలో అడుగుపెట్టబోతున్నాడు. కొత్త దర్శకులకు అవకాశం ఇవ్వడంలో ప్రత్యేక శ్రద్ధ చూపించే విజయ్ ఇంత తక్కువ స్పాన్ లో కెరీర్ లో ఫోర్బ్స్ లిస్టు లోకి చేరుకోవడం అంటే చిన్న విషయం కాదుగా