Begin typing your search above and press return to search.
విజయ్ కెరీర్ లో హిట్స్ కంటే ప్లాప్సే ఎక్కువ..!
By: Tupaki Desk | 26 Aug 2022 1:56 PM GMTరౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రల్లో నటించి.. ఇప్పుడు హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకునేందుకు కృషి చేస్తున్నాడు. 'నువ్విలా' సినిమాతో తెరంగేట్రం చేసిన వీడీ.. ఆ తర్వాత 'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' 'ఎవడే సుబ్రహ్మణ్యం' వంటి సినిమాలో సపోర్టింగ్ రోల్స్ చేసాడు. ఈ క్రమంలో 'పెళ్లిచూపులు' తో హీరోగా మారాడు.
తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇన్నోసెంట్ అబ్బాయిగా నటించి అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే వెంటనే 'ద్వారక' సినిమాతో పరాజయం మూటగట్టుకున్నాడు. అయితే 'అర్జున్ రెడ్డి' సినిమా విజయ్ దేవరకొండ ను ఓవర్ నైట్ స్టార్ డమ్ తెచ్చిపెట్టిందని చెప్పాలి. ఈ మూవీతో యూత్ ఆడియన్స్ కు బాగా దగ్గరైన విజయ్.. దీంతో క్రేజీ హీరో అయ్యాడు.
'మహానటి' సినిమాలో స్పెషల్ రోల్ లో కనిపించిన విజయ్.. 'గీత గోవిందం' చిత్రంతో ఫ్యామిలీ ఆడియన్స్ కు చేరువయ్యే ప్రయత్నం చేశాడు. అయితే రౌడీ స్టార్ సక్సెస్ ట్రాక్ ని కొనసాగించలేకపోయాడు. 'నోటా' మూవీతో తమిళ మార్కెట్ ని టార్గెట్ చేయాలని ప్లాన్ చేసిన VD.. బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాడు.
ఇదే క్రమంలో వచ్చిన 'ట్యాక్సీవాలా' సినిమా ఆశించిన స్థాయిలో ఫ్యాన్స్ ని మెప్పించలేపోయింది. అలానే 'డియర్ కామ్రేడ్' మూవీ బాక్సాఫీస్ వద్ద ప్లాప్ గా మిగిలింది. ఇకపై ప్రేమకథలు చేయనంటూ ప్రకటిస్తూ చేసిన 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. దీంతో కాస్త గ్యాప్ తీసుకొని ఇప్పుడు 'లైగర్' చిత్రంతో ఏకంగా పాన్ ఇండియాకు గురి పెట్టాడు వీడీ.
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన స్పోర్ట్స్ యాక్షన్ మూవీ ''లైగర్''. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ కథాంశంతో రూపొందిన ఈ సినిమా గురువారం తెలుగు హిందీ తమిళ మలయాళ కన్నడ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ అయింది. అయితే తొలి రోజే నెగెటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ అల్ట్రా డిజాస్టర్ దిశగా పయనిస్తోందని ట్రేడ్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.
భారీ అంచనాల నడుమ విడుదలైన 'లైగర్' మూవీ ప్రేక్షకులను తీవ్రంగా నిరాశ పరిచింది. విజయ్ దేవరకొండ తన వరకూ ఫుల్ ఎఫర్ట్స్ పెట్టినప్పటికీ కథలో దమ్ము లేకపోవడంతో సినిమాని లేపలేకపోయాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే లైఫ్ టైం కలెక్షన్స్ తో సినిమా బడ్జెట్ వెనక్కి తీసుకురావడం కష్టమే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీన్ని బట్టి 'లైగర్' మూవీ కూడా VD ప్లాప్స్ లిస్టులో చేరిపోయినట్లే అని చెప్పాలి.
విజయ్D కెరీర్ ని పరిశీలిస్తే హిట్స్ కంటే ప్లాప్స్ ఎక్కువ ఉన్నాయనే విషయం అర్థమవుతుంది. అంతేకాదు బాక్సాఫీస్ రికార్డులను బద్దలుకొట్టిన సినిమాలు కూడా లేవు. 'పెళ్లి చూపులు' 'అర్జున్ రెడ్డి' 'గీత గోవిందం' మినహా మిగతా సినిమాలేవీ చెప్పుకోదగ్గ విజయం సాధించలేదు.
స్క్రిప్ట్ సెలక్షన్ లో విజయ్ దేవరకొండ చేసే తప్పిదాలే దీనికి కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. క్రేజ్ ను క్యాష్ చేసుకునే క్రమంలో సరైన కథలను ఎంచుకోకపోవడం వలన ఆశించిన స్థాయిలో విజయాలను అందుకోలేకపోయాయి. ఇప్పుడు 'లైగర్' సినిమా ఆ విషయాన్ని మరోసారి స్పష్టం చేసింది. మరి ఇప్పటి నుంచైనా VD కేవలం తమ పాత్ర గురించి ఆలోచించకుండా.. కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటారేమో చూడాలి.
ఇకపోతే విజయ్ దేవరకొండ ప్రస్తుతం 'ఖుషీ' అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సమంత రూత్ ప్రభు హీరోయిన్ గా నటిస్తోంది. అలానే పూరీ జగన్నాథ్ తో 'జనగణమ' (JGM) అనే మరో పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ఈ రెండు చిత్రాలతో వీడీ మళ్లీ ట్రాక్ లోకి వస్తాడేమో చూడాలి.