Begin typing your search above and press return to search.

దేవరకొండను వదలని తమిళ తంబీలు

By:  Tupaki Desk   |   13 Dec 2018 11:17 AM GMT
దేవరకొండను వదలని తమిళ తంబీలు
X
విజయ్ దేవరకొండ క్రేజ్ గురించి చెప్పాలంటే పేజీలకు పేజీలు రాయాల్సి వచ్చేలా ఉంది. అర్జున్ రెడ్డి ఒక రకమైన ఇమేజ్ తీసుకొస్తే గీత గోవిందం ఫ్యామిలీ ఆడియన్స్ ని దగ్గర చేసింది. అందుకే తమిళ తంబీలు కూడా ఈ విజయ్ మేనియాని క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు. మొదటి ప్రయత్నంగా నోటాను తీస్తే అది కాస్త దారుణంగా పరాజయం పాలైంది. ద్విభాషా అన్నారు కానీ నిజానికి నోటా తీసింది తమిళ్ లోనే. తెలుగులో డబ్ చేసారు అంతే. ఇప్పుడు అలాంటిదే మరో ప్రయత్నం జరుగుతున్నట్టుగా ఫిలిం నగర్ టాక్.

తమిళ నిర్మాత ఎస్ఆర్ ప్రభు నిర్మాత శ్రీ కార్తీక్ అనే దర్శకుడిని పరిచయం చేస్తూ విజయ్ దేవరకొండ హీరోగా ఓ భారీ ప్రాజెక్ట్ రూపొందించే దిశగా చర్చలు జరుగుతున్నాయని తెలిసింది. అయితే దీనికి కొంత టైం పట్టొచ్చు. విజయ్ ప్రస్తుతం డియర్ కామ్రేడ్ తో పాటు క్రాంతి మాధవ్ సినిమాలతో బిజీగా ఉన్నాడు,. ఇంకో ఐదు నెలల దాకా గ్యాప్ దొరికే ఛాన్స్ లేనట్టే. ఎస్ ఆర్ ప్రభు సినిమాకు టైంపడుతుంది. కానీ తమిళ్ లో మన హీరోలు గట్టిగా జెండా పాతలేని పరిస్థితుల్లో విజయ్ మరోసారి ఎందుకు రిస్క్ చేస్తున్నాడో.

తెలుగులోనే ఇంత బలమైన మార్కెట్ ఉండగా ఎందుకు రిస్క్ అంటే విజయ్ దేవరకొండ దేశవ్యాప్తంగా శ్రీదేవి కూతురు లాంటి సెలబ్రిటీలనే మెప్పించినప్పుడు తమిళ ప్రేక్షకులను ఆకట్టుకోవడం పెద్ద విషయం కాదు. పైగా అర్జున్ రెడ్డి అక్కడ రీమేక్ అవుతున్నా అంతకు ముందే ఒరిజినల్ వెర్షన్ ని తంబీలు చూసేశారని ఆన్ లైన్ లెక్కలు చెబుతున్నాయి. సో ఇప్పుడు కాకపోయినా త్వరలో విజయ్ దేవరకొండ తమిళ్ లో గట్టిగా నిలిచేలా ఉన్నాడు.