Begin typing your search above and press return to search.
బడా హీరోలకు విజయ్ దేవరకొండ సవాల్!
By: Tupaki Desk | 7 Jun 2018 5:27 AM GMTబెస్ట్ యాక్టర్.. అవార్డుల విషయంలో ఈ పదానికి ఇప్పుడు అర్ధాలు మారిపోయాయనే మాట వాస్తవమే. గతంలో బాగా నటించిన లీడ్ పాత్రధారికి బెస్ట్ యాక్టర్ అవార్డ్ వచ్చేది. కానీ ఇప్పుడు బాగా ఆడి డబ్బులు తెచ్చిన సినిమాల్లో నటించిన హీరోకు ఉత్తమ నటుడు అవార్డు ఇవ్వడం ఆనవాయితీ అయిపోయింది.
అయితే.. బడా హీరోలే వీటిని ఎక్కువగా ఎగరేసుకుపోతున్న మాట వాస్తవమే. నామినేషన్స్ లోనే చిన్న హీరోలు కనిపించడం మానేసిన వైనం ప్రస్తుతం నడుస్తోంది. కానీ ఫిలింఫేర్ నిర్వాహకులు మాత్రం సిన్సియర్ గానే నామినేషన్స్ ను ప్రకటించినట్లుగా కనిపిస్తోంది. జియో ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ 2018కు సంబంధించిన నామినేషన్స్ వెల్లడి అయ్యాయి. ఇందులో ఖైదీ నంబర్ 150 మూవీ చిత్రానికి గాను మెగాస్టార్ చిరంజీవి.. గౌతమిపుత్ర శాతకర్ణితో నందమూరి బాలకృష్ణ.. బాహుబలి2 మూవీతో ప్రభాస్.. జైలవకుశ చిత్రానికి ఎన్టీఆర్.. గురు మూవీకి గాను వెంకటేష్ పోటీ పడుతున్నారు.
లిస్ట్ ఇక్కడితో అయిపోతే కామన్ గానే ఉండేది. కానీ బెస్ట్ యాక్టర్ రేసులో మరో హీరో ఉన్నాడు. అతనెవరో కాదు.. అర్జున్ రెడ్డితో అదరగొట్టిన విజయ్ దేవరకొండ. ఆ సినిమా సక్సెస్ కు విజయ్ దేవరకొండ నటనే కీలకం అని తెలిసిందే. అలాగే అర్జున్ రెడ్డి పాత్రలో ఒదిగిపోయిన ఈ హీరోకు.. దాదాపు స్టార్ హీరో ఫాలోయింగ్ వచ్చేసింది. ఇలాంటి ట్రెండ్ మన దగ్గర ఇప్పుడే మొదలైంది. బాలీవుడ్ లో అయితే.. అమితాబ్ వంటి సీనియర్ తో రణబీర్ కపూర్ పోటీ పడ్డం గతంలోనే కనిపించింది. ఈ ఏడాది కూడా హృతిక్.. షారూక్ లకతో వరుణ్ ధావన్ పోటీ పడడం కనిపించింది. టాలీవుడ్ లో కూడా ఇలాంటి వాతావరణం కనిపించడం నిజంగా అభినందనీయం.