Begin typing your search above and press return to search.
దేవరకొండ వాళ్లిద్దరికీ ఫిట్టింగ్ పెట్టేశాడు
By: Tupaki Desk | 23 Aug 2018 4:30 PM GMTవిజయ్ దేవరకొండ జోరు చూస్తుంటే మీడియం రేంజి హీరోలే కాదు.. పెద్ద స్టార్లు కూడా కంగారు పడే పరిస్థితి కనిపిస్తోందిప్పుడు. ‘గీత గోవిందం’పై ఉన్న అంచనాల ప్రకారం మంచి వసూళ్లే వస్తాయని అనుకున్నారు కానీ.. మరీ ఈ స్థాయిలో ప్రభంజనం సృష్టిస్తుందని ఎవ్వరూ అనుకోలేదు. ఏకంగా రూ.50 కోట్ల షేర్ మార్కు వైపు దూసుకెళ్తోందీ చిత్రం. బడా బడా స్టార్లకు మాత్రమే సాధ్యమైన ఘనత ఇది. దీని తర్వాత రాబోయే విజయ్ సినిమాలపై అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘గీత గోవిందం’కు పోటీగా ఏదైనా సినిమా రిలీజ్ చేసి ఉంటే దానికి గట్టిగానే పంచ్ పడేది. ఇకపైనా విజయ్ సినిమాకు పోటీగా సినిమాలు రిలీజ్ చేయడానికి సందేహించే పరిస్థితి ఉంటుందనడంలో సందేహం లేదు.
విజయ్ తర్వాతి సినిమా ‘ట్యాక్సీవాలా’ నవంబరు తొలి వారంలో విడుదలవుతుందంటున్నారు. ఆ విషయంలో స్పష్టత లేదు. కానీ అతను నటిస్తున్న ద్విభాషా చిత్రం ‘నోటా’ మాత్రం విడుదల ఖరారు చేసుకుంది. ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా డిసెంబరు 21న తెలుగు.. తమిళ భాషల్లో రిలీజ్ చేస్తారట. ‘ట్యాక్సీవాలా’ కంటే కూడా దీనిపైనే ఎక్కువ అంచనాలున్నాయి. స్టూడియో గ్రీన్ లాంటి పెద్ద సంస్థ.. విక్రమ్ తో ‘ఇంకొక్కడు’ తీసిన ఆనంద్ శంకర్ డైరెక్షన్లో తీస్తున్న సినిమా ఇది. ఇందులో విజయ్ యంగ్ పొలిటీషియన్ అంటున్నారు. దీని టైటిల్.. ఫస్ట్ లుక్ అన్నీ కూడా అంచనాల్ని పెంచాయి. దీనిపై భారీ అంచనాలే ఉంటాయనడంలో సందేహం లేదు. ఈ సినిమా వస్తుందని తెలియక వరుణ్ తేజ్ మూవీ ‘అంతరిక్షం’.. శర్వానంద్ చిత్రం ‘పడి పడి లేచె మనసు’లను క్రిస్మస్ వీకెండ్ కు షెడ్యూల్ చేసి పెట్టారు. ఇప్పుడు చూస్తే ‘నోటా’ వాటికి ఫిట్టింగ్ పెట్టేలా ఉంది. ఆ రెండు సినిమాలపైనా పాజిటివ్ బజ్ ఉంది కానీ.. వాటితో పోలిస్తే విజయ్ చిత్రానికే క్రేజ్ ఎక్కువ ఉంటుందనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలో ఆ చిత్రాలు యధావిధిగా రిలీజవుతాయో లేదో చూడాలి.