Begin typing your search above and press return to search.

నోటా టైటిలెందుకు రాజా!!

By:  Tupaki Desk   |   5 Oct 2018 12:42 PM GMT
నోటా టైటిలెందుకు రాజా!!
X
ఈ రోజు విడుదలైన విజయ్ దేవరకొండ నోటాకు ఆశించిన దాన్ని కన్నా భిన్నమైన స్పందన దక్కడం పట్ల ఫ్యాన్స్ తో పాటు దర్శక నిర్మాతలు కూడా షాక్ లో ఉన్నారు. మొదటిరోజు టాక్ ని బట్టే పూర్తి ఫలితాన్ని చెప్పేయడం భావ్యం కాదు కాబట్టి ఆ సంగతి అలా ఉంచితే టైటిల్ కి సంబందించిన చర్చ మాత్రం సినిమా చూసినవాళ్లలో జోరుగా సాగుతోంది. కారణం నోటా అనే పేరు. నిజానికి ఈ కథలో మాటవరసకు కూడా నోటా ప్రస్తావన రాదు.

సినిమా మొదలైన ఐదు నిమిషాలకే ముఖ్యమంత్రి అయిన హీరో పాత్ర మొదలుకుని కథలో కీలకంగా ఉండే జర్నలిస్ట్ సత్యరాజ్ కానీ హీరో తండ్రి నాజర్ కానీ ఆ మాటే పలకరు. పోనీ కథకు ఏమైనా లింక్ ఉందా అంటే అదీ లేదు. చివరి అరగంట ఉన్నప్పుడు మాత్రమే బై ఎలక్షన్స్ వస్తాయి. హీరో వరుణ్ పాత్రకే సింపతీ ఉంటుంది కాబట్టి సులభంగా గెలిచేస్తాడు. సో అక్కడా నోటా కనిపించదు. మరి ఆనంద్ శంకర్ ఈ టైటిల్ ఎందుకు పెట్టినట్టో ఎంత జుత్తు పీక్కున్నా అర్థం కాదు.

నిజానికి నోటా అనేది రాజ్యాంగం ఇచ్చిన ప్రత్యేకమైన హక్కు. ప్రతిపాదించిన అభ్యర్థులు ఎవరూ మనకు నచ్చనప్పుడు ఎన్నికల్లో తటస్థంగా నోటా మీట నొక్కే వసతి ఎలక్షన్ కమిషన్ కల్పించింది. రూలింగ్ అపోజిషన్ ఇండిపెండెంట్ ఎవరూ నచ్చనప్పుడు ఓటరు నిర్భయంగా దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో విజయ్ చేతికి సిరా మరక చూపించి అదే అర్థం వచ్చేలా ప్రమోట్ చేసారు. తీరా సినిమాకు వెళ్ళాక అందులో కనిపించింది వేరు. కనీసం విజయ్ దేవరకొండ ఓటు వేసే సీన్ కూడా లేదు.

ఇక ఎలక్షన్స్ జరిగినట్టు కూడా చూపించరు. అంతా వన్ సైడెడ్ గా విజయ్ దేవరకొండ పాత్ర ఫేవర్ లోనే సాగుతుంది. సో నోటా అనే పేరు క్యాచీగా ఉంటుందని తప్ప నిజంగా కథకు ఏ మాత్రం సంబంధం లేదు. పోనీ పెట్టేటప్పుడు అయినా లాజికల్ గా ప్రేక్షకులు అడుగుతారేమో కదా అనే తలంపు కూడా మేకర్స్ కి రాకపోవడం విచిత్రం.