Begin typing your search above and press return to search.
నోటాతో డేంజర్ గేమ్!!
By: Tupaki Desk | 10 Sep 2018 5:19 PM GMTముందొక లెక్క ఇప్పుడొక లెక్క అన్నట్టుగా ఉంది విజయ్ దేవరకొండ మార్కెట్. గీత గోవిందం యావరేజ్ హిట్ అయినా ఇంత చర్చ ఉండేది కాదేమో కానీ అది ఏకంగా వంద కోట్ల ఇండస్ట్రీ గ్రాసర్ గా మిగలడంతో విజయ్ కంటే ముందు అతని ఇమేజ్ కి రెక్కలొచ్చేసాయి. పాతిక రోజులకే ఒక సినిమా 60 కోట్లకు పైగా షేర్ సాధించడం కేవలం స్టార్ హీరోల విషయంలో మాత్రమే జరుగుతుంది. కానీ ఐదు సినిమాల వయసున్న విజయ్ దేవరకొండ క్రేజ్ కు బాక్స్ ఆఫీస్ లెక్కలు సైతం అంతుచిక్కడం లేదు. ఇప్పుడు ఇది రాబోయే నోటా మీద ప్రభావం చూపిస్తోంది. దీని తెలుగు వెర్షన్ నుంచి నిర్మాత జ్ఞానవేల్ రాజా 30 కోట్ల దాకా ఆశిస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ పాతిక దాకా పెట్టుబడికి బయ్యర్లు రెడీగా ఉన్నా ఆయన మాత్రం తగ్గే ఆలోచనలో లేడని ట్రేడ్ టాక్.
విజయ్ దేవరకొండ బ్లాక్ బస్టర్ కొట్టిన అర్జున్ రెడ్డి-గీత గోవిందంలు పూర్తిగా యూత్ ని ప్లస్ ఫ్యామిలీస్ ని టార్గెట్ చేసినవి మెప్పించినవి. కానీ నోటా పొలిటికల్ థ్రిల్లర్. అందరికి ఈ కాన్సెప్ట్ కనెక్ట్ అయ్యేది కాదు. మరి 30 కోట్ల స్థాయిలో దీనికి ఆశించడం అంటే ఒకరకంగా రిస్క్ అనే చెప్పాలి. విజయ్ దేవరకొండ స్టామినా పూర్తి స్థాయిలో తెలియాలంటే ఇంకో రెండు మూడు సినిమాలు రావాలి. వాటి టాక్ వసూళ్లను బట్టి కంటెంట్ ఎలా ఉన్నా నిర్మాతను సేఫ్ చేయగలిగే రేంజ్ కు విజయ్ దేవరకొండ చేరుకున్నాడా లేదా అనే క్లారిటీ వస్తుంది. ఒకవేళ నిజమైతే కనక ఎంత మొత్తమైనా డిస్ట్రిబ్యూటర్లు వెనుకాడరు. అన్ని గీత గోవిందంలు అర్జున్ రెడ్డిలు కాలేవు కాబట్టి ఇప్పుడే ఇంత హైప్ తో ప్రతి సినిమాను భారీ రేట్లకు కొంటూ పోతే ఎక్కడో ఒక చోట బ్రేక్ పడే ప్రమాదం ఉంది. సో విజయ్ సినిమాల నిర్మాతలైనా క్రేజ్ ఉంది కదా అని ఎక్కువ మొత్తాన్ని కోట్ చేయటం తరువాత వచ్చే వాటికి చిక్కులు తెస్తాయి. నోటా కూడా సూపర్ హిట్ అయ్యిందా సమస్య లేదు. కాదంటేనే టాక్సీ వాలాతో పాటు డియర్ కామ్రేడ్ బిజినెస్ మీద ప్రభావం పడుతుంది. మొత్తానికి నోటా బిజినెస్ స్ట్రాటజీ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.