Begin typing your search above and press return to search.

షాకింగ్ పోస్టర్: 'లైగర్' కోసం న్యూడ్ గా పోజిచ్చిన విజయ్..!

By:  Tupaki Desk   |   2 July 2022 4:29 AM GMT
షాకింగ్ పోస్టర్: లైగర్ కోసం న్యూడ్ గా పోజిచ్చిన విజయ్..!
X
'వరల్డ్ ఫేమస్ లవర్' తర్వాత రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ "లైగర్". 'సాలా క్రాస్ బ్రీడ్' అనేది దీనికి ట్యాగ్ లైన్. ఏస్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ షూటింగ్ పూర్తయ్యింది.

మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ కథాంశంతో రూపొందుతున్న 'లైగర్' సినిమాలో MMA ఫైటర్‌ గా నటించడానికి విజయ్ దేవరకొండ పూర్తిగా మేకోవర్ అయ్యాడు. మునుపెన్నడూ లేని విధంగా సినిమాటిక్ అనుభూతిని అందించడానికి ఈ ఎపిక్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కోసం వీడీ తన ఎఫర్ట్స్ అన్నీ పెడుతున్నారు.

'లైగర్' సినిమాలో హీరో పాత్రను సూచించే సాలా క్రాస్‌ బ్రీడ్ అనే ట్యాగ్‌ లైన్ బోల్డ్‌ గా అనిపిస్తుంది. దీనికి తగ్గట్లుగానే మేకర్స్ ఇప్పుడు విజయ్ కు సంబంధించిన ఓ బోల్డ్ పోస్టర్ ను ఆవిష్కరించి అందరికి షాక్ ఇచ్చారు.

ఇందులో VD చేతిలో గులాబీలు పట్టుకొని ఒంటి మీద ఎలాంటి బట్టలు లేకుండా దాదాపు నగ్నంగా నిలబడి ఉన్నాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట సంచలనం సృష్టిస్తోంది. ఏ హీరో అయినా ఇలా పోజులివ్వడానికి ఎంతో ధైర్యం ఉండాలి. ఇప్పుడు విజయ్ ఒక బ్రేవ్‌ హార్ట్ అని నిరూపించాడు.

ఒక పాపులర్ స్టార్ అయినప్పటికీ, తన సినిమాల కోసం ఎంత దూరమైనా వెళ్లడానికి తాను సిద్ధమే అని ఈ పోస్టర్ ద్వారా ప్రకటించారు వీడీ. అయితే అదే సమయంలో లైగర్ న్యూడ్ ఫోటోపై నెగెటివ్ కామెంట్స్ చేసేవారు కూడా ఉన్నారు. విజయ్ పై కరణ్ జోహార్ ఎఫెక్ట్ పడిందని ట్రోల్ చేస్తున్నారు.

'లైగర్' సినిమాలో బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ ఒక శక్తివంతమైన పాత్రను పోషించాడు. విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే కథానాయికగా కనిపించనుంది. ఇటీవల ముంబైలో లీడ్ పెయిర్‌ పై ఒక పాటను చిత్రీకరించారు. ఈ క్రమంలో చిత్ర బృందం విజయ్ న్యూడ్ ఫోటోని ప్రమోషన్స్ మొదలు పెట్టారు.

పూరీ కనెక్ట్స్ మరియు ధర్మ ప్రొడక్షన్స్ కలసి సంయుక్తంగా భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. పూరి జగన్నాధ్ - ఛార్మీ కౌర్ - కరణ్ జోహార్ మరియు అపూర్వ మెహతా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. విష్ణు శర్మ సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేయగా.. థాయ్ ల్యాండ్ కు చెందిన కెచా స్టంట్ డైరెక్టర్ గా చేశారు.

'లైగర్' చిత్రాన్ని 2022 ఆగస్టు 25న హిందీ, తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళం భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు.