Begin typing your search above and press return to search.
మరో ఆఫర్ ప్రకటించిన దేవరకొండ..!
By: Tupaki Desk | 19 Nov 2018 3:38 PM ISTప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల సీజన్ నడుస్తోంది. రాజకీయ నాయకులు తమకు ఓటు వేస్తే అది ఫ్రీ, ఇది ఫ్రీ అంటూ ప్రచారాలు చేస్తున్నారు. వారిని చూసి ఇన్సిఫైర్ అయ్యాడో లేక మరేంటో కాని విజయ్ దేవరకొండ ఉచిత స్నాక్స్ ఆఫర్ ప్రకటించాడు. తాజాగా విజయ్ దేవరకొండ ‘ట్యాక్సీవాలా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఊహించని విధంగా ట్యాక్సీవాలా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. మొదటి రోజే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ దక్కించుకుంది. ఇకపై వచ్చేవన్నీ నిర్మాతలకు లాభాలే. దాంతో విజయ్ దేవరకొండ ప్రేక్షకులకు బంపర్ ఆఫర్ ప్రకటించాడు.
ట్యాక్సీవాలా సినిమా సక్సెస్ వేడుక సందర్బంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. మళ్లీ మిమ్మల్ని థియేటర్ లో కలిసేందుకు చాలా సమయం పట్టనుంది. తదుపరి చిత్రం విడుదలకు చాలా సమయం ఉంది. అందుకే ఇప్పుడే ఫుల్ ఎంజాయ్ చేయండి. మరోసారి గట్టిగా కొట్టాం. మేమంతా చాలా హ్యాపీగా ఉన్నాం. అందుకే మీరు కూడా హ్యాపీగా ఉండాలని ఒక సర్‌ప్రైజ్ గిఫ్ట్ మా తరపున ఇస్తున్నాం. ఇంటర్వెల్ లో స్నాక్స్ ఎంత కావాలంటే అంత, ఎన్ని కావాలంటే అన్ని తినేయండి. బిల్లు మేం కడతాం అంటూ బంపర్ ఆఫర్ ప్రకటించాడు.
ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో విజయ్ దేవరకొండ ప్లాన్స్ అదిరిపోతాయి. సినిమాకు చాలా విభిన్నంగా పబ్లిసిటీ చేయడంలో విజయ్ దేవరకొండ ముందుంటాడనడంలో ఎలాంటి సందేహం లేదు. విజయ్ దేవరకొండ ట్యాక్సీవాలా విడుదల రోజు స్వయంగా ట్యాక్సీవాలా అయ్యి ఎంతో మందిని గమ్యస్థానాలకు చేర్చుతూ అందరి దృష్టిని ఆకర్షించాడు. తాజాగా ఈ స్నాక్స్ ఫ్రీతో సినిమాకు మరింతగా భారీ పబ్లిసిటీ దక్కడం ఖాయం అంటున్నారు.