Begin typing your search above and press return to search.
40 ఏళ్ల అర్జున్ రెడ్డిని చూడాలనుందట
By: Tupaki Desk | 23 April 2018 6:47 AM GMTతెలుగు సినిమా చరిత్రలో ‘అర్జున్ రెడ్డి’ది ప్రత్యేకమైన స్థానమే. ఇలాంటి రెవల్యూషనరీ ఫిలిమ్స్ అరుదుగా వస్తుంటాయి. సినిమా అంటే ఇలాగే తీయాలి అనే అభిప్రాయాలన్నింటినీ మార్చేసిన సినిమాల్లో ఇదొకటనడంలో సందేహం లేదు. పెద్దగా పేరు లేని ఓ హీరోను పెట్టి ఓ కొత్త దర్శకుడు ఇలాంటి సినిమా తీయడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఈ చిత్రం వేరే ఇండస్ట్రీల వాళ్లనూ అమితంగా ఆకట్టుకుంది. ఈ చిత్రం తమిళ.. హిందీ భాషల్లో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో హీరోగా ఎనలేని పేరు సంపాదించిన విజయ్ దేవరకొండ దాదాపు అరడజను సినిమాలతో బిజీ అయిపోయాడు. దర్శకుడు సందీప్ రెడ్డి హిందీలో ‘అర్జున్ రెడ్డి’ తీసే సన్నాహాల్లో ఉన్నాడు. ఆ తర్వాత అతను మహేష్ బాబుతోనూ పని చేయబోతున్నాడు.
ఐతే సందీప్-విజయ్ భవిష్యత్తులో మళ్లీ కలిసి పని చేసే అవకాశాలు లేకపోలేదు. అది ‘అర్జున్ రెడ్డి’ సీక్వెల్ తోనే కూడా కావచ్చేమో. తమ మధ్య ఇప్పటికే ఆ చర్చ జరిగినట్లు కూడా విజయ్ చెప్పాడు. సీక్వెల్ తీస్తే ఎలా ఉండాలని తాము చర్చించుకున్నట్లు చెప్పాడు. అర్జున్ రెడ్డి అనేవాడికి 40 ఏళ్ల వయసొస్తే అతనెలా ఉంటాడు.. ఎలా ప్రవర్తిస్తాడు.. అప్పటికి అతడి జీవితం ఎలా మారి ఉంటుంది అన్నదానిపై తామిద్దరం మాట్లాడుకున్నామని.. భవిష్యత్తులో కుదిరితే ‘అర్జున్ రెడ్డి’ సీక్వెల్ చేస్తామని విజయ్ చెప్పాడు. ఐతే విజయ్.. సందీప్ కమిట్మెంట్లు చూస్తుంటే కనీసం మూడేళ్ల పాటు వీళ్లిద్దరూ కలిసి సినిమా చేయడానికి అవకాశం లేనట్లే. నిజంగా వీళ్ల కాంబినేషన్లో ‘అర్జున్ రెడ్డి’ సీక్వెల్ వస్తే మాత్రం దానిపై అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.