Begin typing your search above and press return to search.
అర్జున్ రెడ్డి కోపం రియల్ లైఫ్ లో...
By: Tupaki Desk | 31 Aug 2017 8:24 AM GMTటాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ అర్జున్ రెడ్డి. చిన్న సినిమా అయినా పెద్ద విజయం సాధించడమే కాదు.. అర్జున్ రెడ్డిని దర్శకుడు తీర్చిదిద్దిన విధానం.. ఆ పాత్రను విజయ్ దేవరకొండ పోషించిన తీరుకు.. విపరీతమైన ప్రశంసలు వస్తున్నాయి. నియంత్రించుకోలేనంత కోపం ఉండే పాత్రలో విజయ్ దేవరకొండ ఇరగదీసేశాడు.
అయితే.. ఆ సినిమా విడుదలకు ముందు వివాదాల్లో ఇరుక్కున్న ఈ హీరో.. రిలీజ్ తర్వాత మాత్రం ఎక్కడా కనిపించలేదు. సోషల్ మీడియాలో ఒకటీ అరా ట్వీట్స్ పెడుతున్నా.. ఈ 28 ఏళ్ల హీరో మాత్రం బయట కనిపించలేదు. ఇప్పుడు అర్జున్ రెడ్డిని జనాలు రిసీప్ చేసుకున్న తీరుపై స్పందించిన విజయ్ దేవరకొండ.. ఈ స్థాయి రెస్పాన్స్ అసలు ఊహించలేదని అంటున్నాడు. "ఈ కేరక్టర్ కొత్తగా ఉంటుందని.. జనాలకు నచ్చుతుందని.. చాలా స్పెషల్ అని మాకు తెలుసు. అయితే.. ఎంత స్పెషల్ అని ఊహించలేదు. ఈ సినిమాలో చూపించిన రా ఎమోషన్స్ గురించి దర్శకుడు చెప్పినపుడు నాకు బాగా నచ్చేసింది. ఆ కేరక్టర్ కి సంబంధించిన ఎమోషన్స్.. నేను రియల్ లైఫ్ లో కూడా ఎదుర్కొన్నాను. ఇక కోపం విషయానికి వస్తే మన అందరిలో కూడా ఇలాంటి కొన్ని ఫీలింగ్స్ ఉంటాయని నాకు అనిపించింది" అన్నాడు విజయ్ దేవరకొండ.
"నెగిటివ్ కేరకట్ర్ చేయడం నాకు కష్టం అనిపించలేదు. నాలో కూడా కొన్ని చెడు అంశాలు ఉంటాయి. నిజానికి మన అందరిలో కూడా ఉంటాయి. మూడ్ బాగోక ఇంచికి వచ్చినపుడు.. నాన్న ఆ విషయాన్ని అర్ధం చేసుకుని ఒంటరిగా వదిలేయమంటారు. కానీ అమ్మ మాత్రం అలా వదిలిపెట్టదు. అర్జున్ రెడ్డి కేరక్టర్ ఫీలింగ్స్ ను ఇంటికి కూడా తీసుకెళ్లిన సందర్భాలు ఉన్నాయి. నాకు షార్ట్ టెంపర్ ఉంది. ఈ కేరక్టర్ కారణంగా మరింతగా పెరిగేది" అన్నాడు విజయ్.
తనకు సిగరెట్ తాగే అలవాటు లేదని.. కానీ ఈ పాత్ర కోసం సిగరెట్ పొగను గుండెల్లోకి తీసుకోవాల్సి వచ్చిందని చెప్పిన విజయ్ దేవరకొండ.. అదృష్టవశాత్తూ సినిమా షూటింగ్ చివరి రోజునే సిగరెట్ వదిలేసినట్లు చెప్పాడు. అలాగే లిక్కర్ తాగే సీన్స్ విషయంలో చాలా సార్లు కోక్ తో మేనేజ్ చేశామని.. కొన్ని సీన్స్ మాత్రం రియాలిటీ ఫీలింగ్ కోసం నిజంగానే మందు తాగి షూట్ చేసినట్లు చెప్పాడు విజయ్ దేవరకొండ.