Begin typing your search above and press return to search.

ఫ్యాన్ అనడం నచ్చదు అందుకే రౌడీ!

By:  Tupaki Desk   |   13 Aug 2018 7:22 AM GMT
ఫ్యాన్ అనడం నచ్చదు అందుకే రౌడీ!
X
టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ తాజా చిత్రం 'గీత గోవిందం' ఆగష్టు 15 న విడుదలకు సిద్ధం అవుతోంది. దీంతో సినిమా ప్రమోషన్స్ తో బిజీ గా గడుపున్నాడు. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించాడు. తన అభిమానులని రౌడీలని ఎందుకు పిలుస్తాడో చెప్పాడు. "వాళ్ళకు ఏ అర్హత అందో అది దక్కేదాకా పోరాడాలి అందుకే వాళ్ళను రౌడీలంటాను. మరో కారణం ఏంటంటే నాకు ఫ్యాన్ అనే పదం పెద్దగా నచ్చదు."

రౌడీలు రెండు నిముషాలు కూడా పనికిరాని పనులపై టైమ్ వేస్ట్ చెయ్యడం తనకు నచ్చదన్నాడు. సమయన్ని ప్రోడక్టివ్ గా వాడాలని - అవకాశాలని అందిపుచ్చుకోవాలని - ఇతరులకంటే డబల్ హార్డ్ వర్క్ చేసి విజయం సాధించాలని చెప్పాడు. తన అభిమానులు ఇతరులను ట్రోలింగ్ చేయడం గురించి అడిగితే స్ట్రిక్ట్ గా 'నో' అని చెప్పాడు. 'అర్జున్ రెడ్డి' లో అర్జున్, 'గీత గోవిందం' లో గోవింద్ పాత్రలలో ఏదో తనకు ఎక్కువగా కనెక్ట్ అయిందని అడిగితే "నాకైతే అర్జున్ ఎందుకంటే అతని లైఫ్ - ఎమోషన్స్ నేను రిలేట్ చేసుకోగలను. కానీ ఆడియన్స్ కు గోవింద్ నచ్చే అవకాశం ఉంది ఎందుకంటే అతను స్వీట్ పర్సన్.. అతని పరిస్థితి చూసి జాలి పడకుండా ఉండలేరు."

'టాక్సీవాలా' ఆలస్యానికి కారణం ఏంటి అని అడిగితే "రెండు పాత్ బ్రేకింగ్ సినిమాల ఇంపాక్ట్ అది. దాంతో నిర్మాణ సంస్థలు నిన్ను గుర్తిస్తాయి.. వాళ్ళు నీతో పనిచేయడానికి ఎగ్జైట్ అవుతారు" అంటూ తనకొచ్చిన సెన్సేషనల్ ఇమేజ్ కారణంగా మార్పులు జరిగాయని దాంతో లేట్ అయిందని పరోక్షంగా చెప్పాడు. టాలీవుడ్ లో కాంపిటీషన్ గురించి అడిగితే దాని గురించి ప్రస్తుతానికి తనకు తెలీదని అన్నాడు.