Begin typing your search above and press return to search.
ఆ సినిమా ఎక్కడ విజయ్ ?
By: Tupaki Desk | 28 May 2018 6:17 AM GMTఅర్జున్ రెడ్డి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత ఆచితూచి సినిమాలు చేస్తున్న విజయ్ దేవరకొండ ఈ మధ్యే మహానటితో మరో సూపర్ సక్సెస్ తన ఖాతాలో వేసుకున్నాడు కానీ అందులో హీరో రోల్ కాదు కనక పూర్తి క్రెడిట్ అతనికి దక్కలేదు. ప్రస్తుతం ట్యాక్సి వాలా విడుదల కోసం ఎదురు చూస్తున్న విజయ్ ద్విభాషా చిత్రం నోటాతో పాటు డియర్ కామ్రేడ్ చేస్తున్న సంగతి తెలిసిందే. వీటితో పాటు పరశురామ్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ మొదలుపెట్టిన సినిమా గురించి అప్ డేట్స్ పూర్తిగా ఆగిపోయాయి. అసలు అది నిర్మాణంలో ఉందా లేక ఆగిపోయిందా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. ఇది కాకుండా క్రాంతి మాధవ్ తో ఒప్పుకున్న సినిమా గురించిన సమాచారం కూడా రావడం లేదు. ఉంగరాల రాంబాబు తర్వాత గ్యాప్ తీసుకున్న క్రాంతి మాధవ్ గతంలో ఓనమాలు-మళ్ళి మళ్ళి రాని రోజు లాంటి విభిన్నమైన కథా చిత్రాలతో ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. కానీ కమర్షియల్ గా ట్రై చేద్దామని సునీల్ తో చేసిన ఉంగరాల రాంబాబు మాత్రం చేదు ఫలితం ఇచ్చింది. దాని విడుదలకు ముందే విజయ్ దేవరకొండతో సినిమా చేసే అంగీకారం జరిగింది.
ఇప్పుడు విజయ్ దేవరకొండ ఇది డ్రాప్ అయ్యాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. అర్జున్ రెడ్డి వచ్చి ఏడాది దాటినా ఫుల్ లెంగ్త్ హీరోగా చేసిన మూవీ ఇంకా ఏది రాలేదు. అప్పుడెప్పుడో చాన్నాళ్ల క్రితం షూటింగ్ ఆగిపోయిన సినిమా ఒకటి విడుదలైంది కానీ విజయ్ తో సహా ప్రేక్షకులెవరు దాన్ని పట్టించుకోలేదు కాబట్టి కౌంట్ లోకి రాదు. ట్యాక్సీ వాలా రిలీజ్ అయ్యాక పైన చెప్పిన సినిమాలు అప్ డేట్ ఇస్తాడా లేక ఏ న్యూస్ లేదు కాబట్టి ఆగిపోయాయి అనే మనమే అర్థం చేసుకోవాలా అంటే వెంటనే చెప్పలేం. సంవత్సరం వస్తున్న సినిమా కనక అర్జున్ రెడ్డి ప్రభావం ట్యాక్సి వాలాకు అనుకూలంగా ఉంటుంది. ఇది కనక హిట్ అయితే నోటాతో పాటు డియర్ కామ్రేడ్ కు ఇంకా హెల్ప్ అవుతుంది. మరి క్రాంతి మాధవ్ ది ఏదో ఫ్లో లో ఒప్పుకున్న సినిమానా లేక తప్పుకున్న ప్రాజెక్టా అనేది విజయ్ చెప్పాలి . జూన్ రెండో లేదా మూడో వారంలో ట్యాక్సివాలా విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు. రాహుల్ సంకీర్త్యాన్ దర్శకత్వం వహించిన ఆ థ్రిల్లర్ మీద టీజర్ వచ్చాక అంచనాలు పెరిగాయి