Begin typing your search above and press return to search.

మీరు 'నోటా' ను ఫిక్స్‌ అవ్వొద్దు ప్లీజ్‌

By:  Tupaki Desk   |   1 Oct 2018 1:11 PM GMT
మీరు నోటా ను ఫిక్స్‌ అవ్వొద్దు ప్లీజ్‌
X
విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన ‘గీత గోవిందం’ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అయిన విషయం తెల్సిందే. 125 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ ను రాబట్టిన ఆ చిత్రం విడుదల అయ్యి కనీసం వంద రోజులు కూడా కాకుండానే అప్పుడే ‘నోటా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. ఈనెల 5న ‘నోటా’ చిత్రం విడుదల కాబోతుంది. కేవలం తెలుగులోనే కాకుండా ఈ చిత్రంతో తమిళంలో కూడా మనోడు అదృష్టంను పరీక్షించుకోబోతున్నాడు. తాజాగా ఈ చిత్రం ప్రమోషన్‌ లో భాగంగా మాట్లాడుతూ ప్రేక్షకులు రాబోయే ఎన్నికల్లో నోటాను ఎంచుకోవద్దంటూ సలహా ఇచ్చాడు.

ఎన్నికల్లో పోటీ చేసిన ఏ ఒక్క అభ్యర్థి కూడా నచ్చక పోతే అప్పుడు ఓటరు నోటా మీటను నొక్కాల్సి ఉంటుంది. ఈమద్య కాలంలో నోటా బాగా ఫేమస్‌ అయ్యింది. అందుకే ఈ చిత్రంకు అందరి దృష్టిని ఆకర్షించాలని దర్శకుడు ఆనంద్‌ శంకర్‌ నోటా అనే టైటిల్‌ ను పెట్టి ఉంటాడని టాక్‌ వినిపిస్తుంది. తాము ఈ చిత్రంలో నోటా గురించి ప్రత్యేకంగా ఏమీ చెప్పడం లేదని - ప్రస్తుత రాజకీయ వ్యవస్థ సరిగా లేదు - కొత్త రాజకీయాలు - కొత్త రాజకీయ నాయకులు రావాలి అనేది నోటా సినిమా ఉద్దేశ్యమని, అందుకే ఈ టైటిల్‌ ను పెట్టినట్లుగా విజయ్‌ దేవరకొండ అన్నాడు. మంచి నాయకుడిని ఎంచుకోవాలి తప్ప ఎవరు కూడా నోటాను వినియోగించుకోవద్దంటూ విజయ్‌ పిలుపునిచ్చాడు.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కాని, తమిళనాడులో కాని - దేశంలో మరెక్కడైనా కాని జరుగుతున్న రాజకీయాలకు ‘నోటా’ సినిమాకు సంబంధం లేదని - ఈ సినిమాలో ఎమోషనల్‌ మరియు ఫిలాసఫీకి సంబంధించిన విషయాలకు నోటా టైటిల్‌ బాగా సూట్‌ అవుతుందనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా విజయ్‌ పేర్కొన్నాడు. తమిళంలో ఈ చిత్రంను చేయాలని దర్శకుడు ఆనంద్‌ శంకర్‌ కు తాను సలహా ఇచ్చానని, నా సలహాను గౌరవించి జ్ఞానవేల్‌ రాజా గారు, ఆనంద్‌ శంకర్‌ గారు తమిళంలో కూడా ఈ సినిమాను చేశారు. తమిళంలో ఈ చిత్రంతో గుర్తింపు తెచ్చుకోవాలనే ఉద్దేశ్యం కాదని, సౌత్‌ ప్రేక్షకులు ఈ మంచి సినిమాను చూడాలనే ఉద్దేశ్యం మాత్రమే అంటూ విజయ్‌ చెప్పుకొచ్చాడు.