Begin typing your search above and press return to search.
'నోటా' ఎందుకు చేశానా అనుకున్నా!
By: Tupaki Desk | 2 Oct 2018 1:30 AM GMTవిజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘నోటా’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రం అక్టోబర్ 5న విడుదల చేయాలని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. తమిళంలో ఈ చిత్రంతో విజయ్ దేవరకొండ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. భారీ అంచనాలున్న ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ స్వయంగా తమిళంలో డబ్బింగ్ చెప్పాడు. తమిళం రాకున్నా కూడా నేర్చుకుని మరీ డబ్బింగ్ చెప్పినట్లుగా పేర్కొన్నాడు.
తాజగా ఒక ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ... తెలుగులో డబ్బింగ్ ను కేవలం కొన్ని నిమిషాల్లో పూర్తి చేసే నేను, తమిళంలో డబ్బింగ్ కోసం మాత్రం ఏకంగా మూడు రోజులు పట్టిందన్నాడు. నోటా చిత్రంలో కొన్ని డైలాగ్ తమిళంలో చెప్పేందుకు చాలా ఇబ్బంది పడ్డాడనన్నాడు. డబ్బింగ్ సమయంలో అసలు ఈ సినిమా ఎందుకు చేశానురా బాబోయ్ అనుకున్నాను అంటూ విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు.
తెలుగు హీరోలు ఇప్పటి వరకు తమిళంలో రాణించిన దాఖలాలు లేవు. ఒకటి రెండు మినహా స్టార్ హీరోలు నటించిన సినిమాలు తమిళనాట మంచి విజయాన్ని సాధించలేదు. ఆ విజయాన్ని విజయ్ దేవరకొండ నోటాతో దక్కించుకోవాలని తాపత్రయ పడుతున్నాడు. అందుకే సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడంతో పాటు - సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. తెలుగు మరియు తమిళంలో ఈ చిత్రం ఒకే సారి విడుదలవుతున్న కారణంగా భారీ వసూళ్లు నమోదు అవ్వడం ఖాయం అన్నట్లుగా సినీ వర్గాల వారు నమ్మకంతో ఉన్నారు.