Begin typing your search above and press return to search.

యంగెస్ట్ సీఎం చెప్పిన ర‌హ‌స్యం

By:  Tupaki Desk   |   5 Oct 2018 5:01 AM GMT
యంగెస్ట్ సీఎం చెప్పిన ర‌హ‌స్యం
X
ఆ యంగ్ హీరో.. యంగెస్ట్ సీఎం పొరుగింటి పుల్ల‌కూర సీక్రెట్‌ ని బ‌హిరంగంగా లీక్ చేశాడు. `ఇదిగో మ‌చ్చా.. త‌మిళ తంబీలు తీసిన‌ట్టు అస‌లు మ‌న తెలుగోళ్లు సినిమాలు తీయ‌గ‌ల‌రా?`, తంబీల నేటివిటీ ప‌వ‌ర్ ముందు ఎవ‌రైనా నిల‌బ‌డ‌గ‌ల‌రా? ఛ‌స్.. మ‌నోళ్లు ఎప్ప‌టికి మార‌తారు? అన్న కామెంట్లు తెలుగోళ్ల‌లో వినిపిస్తుంటాయి రెగ్యుల‌ర్‌ గా. అవును నిజ‌మేనేమో అని మ‌నం అంతా అనుకుంటాం. కానీ త‌మిళ తంబీలు మ‌న గురించి ఏమ‌నుకుంటారో తెలుసా మ‌చ్చా?

తెలిస్తే షాక్ తింటాం. అస‌లు ఇండియా లెవ‌ల్లోనే తెలుగు సినిమాకి ఉన్న క్రేజు అంతా ఇంతా కాదు. గ‌త మూడు-నాలుగేళ్లుగా ఈ సీన్ క్రియేటైంది. బాహుబ‌లి సిరీస్‌ తో టాలీవుడ్ క్రేజు అమాంతం స్కైని ట‌చ్ చేసింది. కేవ‌లం బాహుబ‌లి వ‌ల్ల‌నే కాదు - ఇక్క‌డ తీస్తున్న సినిమాల్లో క్రియేటివిటీ - కొత్త‌వారికి అవ‌కాశాలిస్తూ ఎంక‌రేజ్ చేసే గొప్ప‌త‌నం అంద‌రికీ న‌చ్చుతోంది. ఇదే విష‌యంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన దేవ‌ర‌కొండ షాకింగ్ నిజాల్నే చెప్పాడు.

అస‌లు మ‌న తెలుగు సినిమా గురించి మ‌ద్రాసీలు ఏమ‌నుకుంటారు మ‌చ్చా? అని ప్ర‌శ్నిస్తే దేవ‌ర‌కొండ ఏం చెప్పాడో తెలుసా? ``మీ తెలుగోళ్లు గొప్పోళ్లు. కొత్త ట్యాలెంటుకు - కొత్త డైరెక్ట‌ర్ల‌కు ఛాన్సిస్తారు. కొత్త క‌థ‌ల్ని ఎంచుకుంటారు. కొత్త‌ద‌నం ఉన్న సినిమాల్ని తెలుగోళ్లు బాగా చూస్తారు. ఎంక‌రేజ్ చేస్తారు. మ‌న ద‌గ్గ‌ర అలా లేదు`` అని తంబీలు వాపోతుంటార‌ట‌. ఇది ప్ర‌త్య‌క్షంగా ఫేస్ చేసిన అనుభ‌వం అని దేవ‌రకొండ చెప్పుకొచ్చాడు. గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా తెలుగు సినీప‌రిశ్ర‌మ‌లోని మార్పును ఇరుగుపొరుగు హ‌ర్షిస్తోంది. తంబీలు అయితే తెలుగు సినిమా అంటేనే చెవి కోసుకుంటున్నారు. రంగ‌స్థ‌లం - భ‌ర‌త్ అనే నేను - అ! - గీత గోవిందం.. ఇలా ఎన్నో సినిమాల్ని ఎంతో క్రియేటివ్‌ గా తీశార‌ని తంబీలు మెచ్చేసుకున్నార‌ట‌. ఫ్లాష్‌ బ్యాక్‌ లోకి వెళితే.. సూర్య -గ‌జిని - సింగం - కార్తీ- ప‌రుత్తివీర‌న్ - ఆవారా లాంటి సినిమాల‌తో ఆక‌ట్టుకున్నపుడు.. ఆ అన్న‌ద‌మ్ముల్ని చూసి మీ తంబీలు భ‌లే ఎంక‌రేజ్ చేస్తారు నేటివిటీని - కొత్త క‌థ‌ల్ని అని మ‌నం మెచ్చుకునేవాళ్లం. బావుంది మ‌చ్చా.. త‌మిళం దేశంలోనే ప్రాచీన భాష అని ఒప్పించుకోగ‌లిగారు వాళ్లు. కానీ తెలుగు ప్రాచీన భాష అని ఒప్పించ‌డంలో చ‌తికిల‌బ‌డ్డాం కానీ, మ‌నం ఎందులోనూ త‌క్కువ కాదు సుమీ!