Begin typing your search above and press return to search.

అర్జున్ రెడ్డీ.. ఏమైపోయావయ్యా

By:  Tupaki Desk   |   3 April 2017 5:05 AM GMT
అర్జున్ రెడ్డీ.. ఏమైపోయావయ్యా
X
‘పెళ్లిచూపులు’ సినిమాతో రాత్రికి రాత్రే మాంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ. అంతకుముందే ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమాతో ఆకట్టుకున్నప్పటికీ.. అతడి పేరు జనాల్లో రిజిస్టరవ్వలేదు. కానీ ‘పెళ్లిచూపులు’ సినిమా అతడికి తిరుగులేని గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ దెబ్బతో అతడికి అవకాశాలు క్యూ కట్టాయి. దాదాపు అరడజను సినిమాలు అతడి ఖాతాలో చేరాయి. ‘పెళ్లిచూపులు’ విడుదలకు ముందే విజయ్ ఓకే చేసిన సినిమా ‘అర్జున్ రెడ్డి’. ఈ చిత్ర టీజర్ కొన్ని నెలల కిందట రిలీజై సంచలనం సృష్టించింది. స్టన్నింగ్ గా అనిపించిన ఈ టీజర్ ఒక్కసారిగా సినిమాపై అంచనాల్ని పెంచేసింది.

ఈ తరం యూత్ ఆడియన్స్ ‘అర్జున్ రెడ్డి’ టీజర్ తో భలే కనెక్టయ్యారు. సోషల్ మీడియాలో ఈ టీజర్ గురించి పెద్ద చర్చే జరిగింది. టాలీవుడ్లో ఇలా ఓ అప్ కమింగ్ హీరో సినిమా టీజర్ ఈ స్థాయిలో చర్చనీయాంశం కావడం అరుదు. ‘అర్జున్ రెడ్డి’ అనే సినిమా అనౌన్స్ చేసినపుడు దానిపై జనాలు పెద్దగా ఆసక్తి చూపించలేదు కానీ.. ‘పెళ్లిచూపులు’తో విజయ్ దేవరకొండ మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత రిలీజైన ఈ టీజర్ ఒక్కసారిగా సినిమాపై అంచనాలు పెంచింది. అప్పట్నుంచి సినిమా ఎప్పుడొస్తుందా అని యూత్ ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ టీజర్ వచ్చాక ఈ సినిమా గురించి అప్ డేట్ లేదు. సినిమా పూర్తయిందా.. ఇంకా షూటింగ్ జరుపుకుంటోందా.. ఏం తెలియదు. మళ్లీ ఈ సినిమాకు సంబంధించి ఏ విశేషం బయటికి రాలేదు. టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో ఈ అడ్వాంటేజీని వాడుకుంటూ సాధ్యమైనంత త్వరగా సినిమాను రెడీ చేస్తే మంచిది. కనీసం సినిమా ప్రోగ్రెస్ గురించి అప్ డేట్ కూడా ఇవ్వకుండా ఇలా సైలెంటైపోతే.. నెమ్మదిగా ఈ సినిమాకున్న క్రేజ్ అంతా పోతుందేమో.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/