Begin typing your search above and press return to search.

బాబా.. ఈ సినిమాను ఏం చేస్తావ్ బాబా?

By:  Tupaki Desk   |   2 March 2017 4:44 AM GMT
బాబా.. ఈ సినిమాను ఏం చేస్తావ్ బాబా?
X
బాబాలూ.. వారి లీలలూ.. వారి మోసాలూ.. వారి ప్రేమలూ. ఈ కాన్సెప్పుపై తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. ఏదో ఒక సినిమాలో ఒక సీక్వెన్సుగా ఈ బాబా ఎపిసోడ్ ను పెట్టడమే కాదు.. ఏకంగా సినిమా సినిమా బాబాలపైనే తీశారు. అయ్యారే సినిమా నుండి గోపాల గోపాల వరకు.. చాలా సినిమాలను చూశాం. ఇప్పుడు అదే కోవలో ''ద్వారక'' అనే సినిమా వస్తోంది.

పెళ్ళిచూపులు సినిమా సూపర్ డూపర్ హిట్టు కావడంతో.. అప్పటికే పూర్తయిన 'ద్వారక' సినిమాకు మాంచి క్రేజ్ తెప్పించుకున్నాడు హీరో విజయ్ దేవరకొండ. దానికితోడు అశోక్ రెడ్డి సినిమా టీజర్లకు కూడా భారీ హైప్ వచ్చేయడంతో.. ఇప్పుడు ఈ ద్వారక సినిమాకు ఇంకా ప్రమోషన్ జరుగుతోంది. ఈ సినిమా రిలీజ్ ట్రైలర్ ను చూస్తుంటే మాత్రం.. చాలా సినిమాలను ఒకే చోట కలిపి చూసినట్లుంది కాని.. అదేంటో ఈ మధ్యన అలాంటి సినిమాలే ఆడేస్తున్నాయి. బాక్సాఫీస్ దగ్గర అటువంటి సినిమాలకే గిరాకీ ఉంది. మరి పెళ్ళిచూపులు ఇచ్చిన సక్సెస్ ను ఈ కుర్ర హీరో మరోమారు రిపీట్ చేస్తాడా?

దొంగ బాబాగా మారిన విజయ్ దేవరకొండ చేతిలోనే ఈ సినిమా ఫేట్ అంతా ఉందని సినిమా వర్గాలు ఉంటున్నాయి. ఒకవేళ దర్శకుడు ఇతన్ని సరిగ్గా వాడుకుని ఉంటే.. ఖచ్చితంగా ఈ బాబా హిట్టు బాబా అయిపోతాడని వారి ఉవాచ. లెటజ్ సీ బాబా. రేపే ఈ సినిమా రిలీజ్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/