Begin typing your search above and press return to search.

విజయ్ దేవరకొండ.. నెక్స్ట్ ఏంటి?

By:  Tupaki Desk   |   1 Sept 2017 4:17 AM
విజయ్ దేవరకొండ.. నెక్స్ట్ ఏంటి?
X
విజయ్ దేవరకొండ.. ప్రస్తుతం టాలీవుడ్లో మార్మోగిపోతున్న పేరు. ‘అర్జున్ రెడ్డి’తో ఓవర్ నైట్ తెలుగు ప్రేక్షకుల్లో సూపర్ పాపులారిటీ సంపాదించుకున్నాడు ఈ యువ నటుడు. ‘ఎవడే సుబ్రమణ్యం’.. ‘పెళ్లిచూపులు’ సినిమాలు కూడా అతడికి మంచి పేరే తెచ్చినప్పటికీ ‘అర్జున్ రెడ్డి’తో వచ్చిన పాపులారిటీ అలాంటిలాంటిది కాదు. ఈ సినిమా తర్వాత విజయ్ చేయబోయే ప్రాజెక్టులపై ఇండస్ట్రీ జనాలతో పాటు సామాన్య ప్రేక్షకుల్లోనూ ఆసక్తి నెలకొంది. విశేషం ఏంటంటే.. ‘పెళ్లిచూపులు’తో వచ్చిన ఫేమ్ తోనే చాలా అవకాశాలు విజయ్ తలుపు తట్టాయి. దాదాపు అరడజను ప్రాజెక్టులకు అతను కమిట్మెంట్ ఇవ్వడం విశేషం.

వీటిలో ఇప్పటికే ఓ సినిమా సెట్స్ మీదికి వెళ్లిపోయింది. గీతా ఆర్ట్స్.. యువి క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం విశేషం. ఈ చిత్రంతో రాహుల్ సాంకృత్యన్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా పేరు సంపాదించిన రాహుల్.. ఇంతకుముందు ‘ది ఎండ్’ అనే హార్రర్ ఫిలిం చేశాడు. అది విమర్శకుల ప్రశంసలందుకుంది. విజయ్ దేవరకొండతో అతను చేస్తున్న సినిమా కూడా చాలా వైవిధ్యంగా ఉంటుందట. ఈ చిత్రం డిసెంబర్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం. మరోవైపు పరశురామ్.. నందిని రెడ్డిలతోనూ విజయ్ సినిమాలు కమిటయ్యాడు. వీటితో పాటు భరత్ కమ్మ అనే కొత్త దర్శకుడితోనూ విజయ్ ఓ సినిమా చేయనున్నాడు.