Begin typing your search above and press return to search.
కరణ్ బర్త్ డే పార్టీకీ టాలీవుడ్ నుంచి ఒకే ఒక్కడు!
By: Tupaki Desk | 26 May 2022 7:30 AM GMTబాలీవుడ్ మల్టీట్యాలెంటెడ్ పర్సనాల్టీ కరణ్ జోహార్ 50 వ పుట్టిన రోజు వేడుకలు గత రాత్రి అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే.. దాదాపు బాలీవుడ్ టాప్ స్టార్స్.. సెలబ్రిటీలంతా పార్టీలో పాల్గొన్నారు. విందు..మందులో సెలబ్రిటీలంతా చిందేసారు. కరణ్ కి స్పెషల్ గా విషెస్ తెలియజేసారు. ప్రతీ ఏడాది కన్నా కరణ్ బర్త్ డే ఈ ఏడాది మరింత ఘనంగా జరిగింది.
దర్శక..నిర్మాతగా..హోస్ట్ గా ఆయన గ్రాప్ మరింత మెరుగ్గా ఉంది. దీంతో సెలబ్రేషన్స్ అదే స్థాయిలో జరిగాయి. ఈ వేడుకల్లో టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ తళుక్కున మెరిసాడు. బ్లాక్ కలర్ షూట్ లో విజయ్ కరణ్ పార్టీకి హాజరయ్యాడు. ఎంట్రీ వద్ద విజయ్ పై ప్రత్యేకం గా ఫోటో షూట్ నిర్వహించారు. బ్లాక్ కలర్ షూట్ లో మిరుమిట్లు గొలిపే రెడ్ కలర్ షైనింగ్ బ్యాక్ డ్రాప్ లో మనోహరంగా కనిపిస్తున్నాడు.
మరి ఈ ఛాన్స్ మిగతా టాలీవుడ్ స్టార్లకు లేదా? విజయ్ కి తప్ప టాలీవుడ్ నుంచి ఇంకెవరికీ ఆహ్వానం అందలేదా? అంటే అవుననే తాజా సన్నివేశాన్ని బట్టి తెలుస్తోంది. కరణ్ ఇన్విటేషన్ కేవలం విజయ్ కి మాత్రమే అందిందని సోర్సెస్ చెబుతున్నాయి. ఇందుకు ప్రత్యేక కారణంలో లేకపోలేదు. విజయ్ హీరోగా నటిస్తోన్న `లైగర్` సినిమా నిర్మాతల్లో కరణ్ జోహార్ ఒకరు. పూరి కనెక్స్ట్ తో కలిసి కరణ్ ధర్మ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని తెలుగు..హిందీ భాషల్లో నిర్మించింది.
పాన్ ఇండియా కేటగిరీలో రిలీజ్ చేస్తున్నారు. అంతకు ముందు `అర్జున్ రెడ్డి` విజయంతో విజయ్ పాన్ ఇండియా లో పాపులర్ అయ్యాడు. కరణ్ హోస్ట్ షోలకు సైతం హాజర్యాడు. ఇలా కరణ్-విజయ్ మధ్య బాండింగ్ మొదలైంది. ఇందులో కీలక పాత్ర పోషించింది పూరి జగన్నాధ్. ఆయన వల్లే విజయ్ -కరణ్ కి మరింత దగ్గరయ్యాడు. ఆ రకంగా టాలీవుడ్ నుంచి కరణ్ పార్టీకి ఒకే ఒక్కడుగా విజయ్ హాజరయ్యాడు.
అయితే ఈ పార్టీకి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్..యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా హాజరవుతున్నట్లు ప్రచారం సాగింది. కానీ వాళ్లెవ్వరు పార్టీలో కనిపించలేదు. మరి ఆహ్వానం అందిందా? లేదా? అందినా వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్నారా? అన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. కరణ్ తో ఆ ఇద్దరి స్టార్స్ బాండింగ్ కూడా ఎంతో ప్రత్యేకమైనది.
`ఆర్ ఆర్ ఆర్` రిలీజ్ సమయంలో ఆ త్రయం మరింత దగ్గరైంది. కానీ నిన్నటి పార్టీలో ఆ ఇద్దరు కనిపించకపోవడంతో టాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ -శంకర్ సినిమా షూట్ లో ఉండగా..ఎన్టీఆర్ కొరటాల ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించే పనిలో నిమగ్నమైన సంగతి తెలిసిందే.