Begin typing your search above and press return to search.

ముద్దుల కంటే పెద్ద సమస్యలు లేవా

By:  Tupaki Desk   |   30 March 2019 8:33 AM GMT
ముద్దుల కంటే పెద్ద సమస్యలు లేవా
X
కథ డిమాండ్ చేస్తుందనో లేక ఇవి లేకపోతే యూత్ కనెక్ట్ కారనో చెప్పలేం కానీ ప్రతి సినిమాలో విజయ్ దేవరకొండ హీరోయిన్ల మధ్య లిప్ లాక్ కిస్ లేనిదే బొమ్మ బయటికి రావడం లేదు. కొద్దిరోజుల క్రితం విడుదలైన డియర్ కామ్రేడ్ టీజర్లో రష్మిక మందన్నతో ఈ ఫీట్ మరోసారి రిపీట్ చేయడంతో ఇది మరోసారి చర్చకు వచ్చింది. ముఖ్యంగా కర్ణాటక రష్మిక ఫాన్స్ మాజీ లవర్ రక్షిత్ శెట్టి అభిమానులు తనను ఓ రేంజ్ లో ట్రాలింగ్ చేశారు.

దీనికి తన మూవీనే వేదిక కావడం పట్ల విజయ్ దేవరకొండ కొంత అసహనానికి గురైనట్టు తెలిసింది. అర్జున్ రెడ్డి నుంచి ఆధర చుంబనం అనేది ఒక ట్రెండ్ గా మార్చిన క్రెడిట్ విజయ్ కే దక్కుతుంది. ఆ తర్వాత అందరూ దాన్ని ఫాలో అవుతున్నప్పటికీ ఫలితాల విషయంలో మాత్రం వాళ్ళు బోల్తా కొడుతున్నారు. ఇదే విషయం విజయ్ దేవరకొండ దృష్టికి తీసుకెళ్లినప్పుడు దేశంలో తీవ్రమైన సమస్యలు చాలా ఉండగా ఆఫ్ట్రాల్ సినిమాలో ఓ సీన్ లో ముద్దు పెట్టుకోవడం గురించి ఇంత డిస్కషన్ అవసరమా అని నిలదీసినట్టు వినికిడి.

అయినా సినిమాలో ఎలాంటి అంశాలు ఉండాలో అది దర్శకుల ఇష్టమని చూడాలో వద్దో నిర్ణయించుకునే స్వేచ్ఛ ప్రేక్షకులకూ ఉందని అలాంటప్పుడు దీన్ని ఇంతగా హై లైట్ చేసుకోవాల్సిన అవసరం ఏముందని అన్నట్టు తెలిసింది. నాలుగు భాషల్లో ఒకేసారి వస్తున్న డియర్ కామ్రేడ్ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. విడుదలకు ఇంకా చాలా టైం ఉన్నపటికీ ఫ్యాన్స్ మాత్రం ఇదో సెన్సేషన్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు