Begin typing your search above and press return to search.

పెళ్ళి చూపులు తరువాత రేటు పెంచేశా

By:  Tupaki Desk   |   28 Feb 2017 4:05 AM GMT
పెళ్ళి చూపులు తరువాత రేటు పెంచేశా
X
'ఏంటి పెళ్ళిచూపులు క్రేజ్ మీద ఆధారపడి చాలా ఫీట్లు చేస్తున్నట్లున్నావ్' అని అడిగితే.. ''అవునండీ రేటు పెంచేశాను'' అంటున్నాడు యంగ్ హీరో విజయ్ దేవరకొండ. మనోడు ఈవారం రిలీజ్ అవుతున్న ''ద్వారక'' సినిమాను ప్రమోట్ చేస్తూ.. ప్రస్తుతం తన కెరియర్ ఓ రేంజులో దూసుకుపోతోందంటూ మంచిగా చెప్పేసిండులే.

''రెండు సంవత్సరాలు కష్టపడితే ఎవడే సుబ్రమణ్యం సినిమాలో రోల్ దక్కింది. అయితే ఆ రోల్ దక్కక ముందు ఎందుకైనా మనం బ్యాకప్ ఆప్షన్లు పెట్టుకుంటే మంచిదని అనిపించి.. రెండు కథలు రెడీ చేసుకున్నాను. ఒక షార్ట్ ఫిలిం కూడా డైరక్ట్ చేశాను. యాక్టర్ కాకపోతే డైరక్టర్ అయ్యుండేవాడిని'' అంటున్నాడు ఈ కుర్ర హీరో. అయితే పెళ్ళిచూపులు సినిమా రిలీజైన తరువాత మనోడి ఫేట్ మారిపోయింది. ఆ సినిమా రిలీజ్ కంటే ముందే షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న ఈ ''ద్వారక'' ఇప్పుడు హైప్ తో రిలీజ్ అవ్వడానికి కారణం ఆ సక్సెస్సే. అంతేకాదు.. మనోడి చేతిలో ఇప్పటికిప్పుడు గీతా ఆర్ట్స్ వారివి రెండు సినిమాలూ.. అలాగే మరో నాలుగు సినిమాలు ఇతర బ్యానర్లలో ఉన్నాయంటే చూసుకోండి.

ఇకపోతే ద్వారక సినిమా అంతా కూడా ద్వారక అనే బిల్డింగ్ చుట్టూ తిరిగే కథ అని చెబుతున్న విజయ్ సాయి దేవరకొండ.. గీతా ఆర్ట్స్ లో చేయబోయే పరశురామ్ సినిమా.. అలాగే రాహుల్ అనే కొత్త కుర్రాడి డైరక్షన్లో చేస్తున్న సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ చాలా కొత్తగా రాబోతున్నాయి అంటున్నాడు. అది సంగతి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/