Begin typing your search above and press return to search.

క్రిటిక్స్ ముందు VD ఇలాంటి ఫోజ్ స‌రికాదేమో?

By:  Tupaki Desk   |   16 Aug 2022 4:44 AM GMT
క్రిటిక్స్ ముందు VD ఇలాంటి ఫోజ్ స‌రికాదేమో?
X
మీడియా స‌మావేశం అంటే ఫ‌లానా విధంగా ఉండాలి! అనే రూల్ ఇప్పుడు లేదు. రూల్ ని బ్రేక్ చేస్తేనే ఏదైనా సంథింగ్ పాజిబుల్. ఇప్పుడు అలాంటి కొత్త‌ద‌నాన్ని ప‌రిచ‌యం చేస్తున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఇంత‌కుముందు బాలీవుడ్ లో లైగ‌ర్ ప్ర‌మోష‌న్స్ కోసం వెళ్లిన‌ప్పుడు ఏ ఇత‌ర హీరో చేయ‌ని సాహ‌సం చేసాడు. అక్క‌డ అవాయ్ చెప్పుల‌ను ఒక ట్రెండ్ సెట్ట‌ర్ గా మార్చాడు. త‌న‌కంటూ ఓ యూనిక్ స్టైల్ ఉంద‌ని చెప్ప‌క‌నే చెప్పాడు. కేవ‌లం రూ.200 ఖ‌రీదు చేసే చెప్పుల‌తో ముంబై వీధుల్లోనూ అత‌డు ప్ర‌చారం చేసిన తీరు సర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

అయితే తెలుగు చిత్ర‌సీమ‌లో అలాంటి ప్ర‌త్యేక‌త ఏదైనా ఉందా? అంటే ఎందుకు లేదు? ఈసారి విజ‌య్ దేవ‌ర‌కొండ అలాంటి ఒక షాకింగ్ మూవ్ మెంట్ తో మ‌రోసారి చ‌ర్చ‌ల్లోకొచ్చారు. ప్ర‌ముఖ ఫిలింక్రిటిక్ అడిగిన ఓ ప్ర‌శ్న‌కు స‌మాధానంగా అత‌డు టేబుల్ పై కాళ్లు పెట్టి ఆక‌స్మిక చ‌ర్య‌తో ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. అయితే అత‌డి చ‌ర్య స‌రైన‌దేనా? అన్న‌దానికి జ‌ర్న‌లిస్టుల్లో డిఫ‌రెంట్ టాక్ న‌డిచింది. అలా జ‌ర్న‌లిస్టుల ముందు అస‌భ్య‌త స‌రికాదు! అని విమ‌ర్శ‌లు చెల‌రేగినా కానీ ఆ సంద‌ర్భం అలా డిమాండ్ చేసింద‌ని విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు మ‌ద్ధ‌తుగా నిలిచారు కొంద‌రు. జ‌ర్న‌లిస్టుల ముందే కాళ్లు అలా టేబుల్ పై పెట్టే ఆలోచ‌న స‌రైన‌దేనా? అంటూ డిబేట్ న‌డిచింది.

అయితే దీనిని స‌రిగా అర్థం చేసుకోవాలి. అత‌డు జ‌ర్న‌లిస్టు ప్ర‌శ్న‌కు అలా స్పందించాడు. అలాగే జ‌ర్న‌లిస్టులు త‌న‌తో సౌక‌ర్యంగా ఉండాల్సిందిగా కోరాడు. తాన పాన్ ఇండియా స్టార్ అయినా కానీ లోక‌ల్ గా ఉండేందుకు ఇష్ట‌ప‌డ‌తాన‌ని త‌న చ‌ర్య‌తో చెప్పే ప్ర‌య‌త్నం చేశాడు. ఆ జ‌ర్న‌లిస్టు పేరును ఎప్ప‌టికీ మ‌ర్చిపోన‌ని కూడా స‌ర‌దాగా వ్యాఖ్యానించాడు.

విజయ్ -అనన్య జంట ప్ర‌స్తుతం లైగ‌ర్ తెలుగు వెర్ష‌న్ ప్రచారంలో బిజీగా ఉన్నారు. తాజా మీడియా మీట్ లో ఊహించ‌ని విధంగా వీడీ మ‌రోసారి చ‌ర్చ‌ల్లోకొచ్చాడు. అసాధారణమైనది ఏదో ఒక‌టి చేయాలి! అప్పుడే క‌దా ప‌బ్లిసిటీ ఈజీగా దొరికేది.. కానీ ఇలా ఫోజివ్వ‌డం స‌రైన‌దిగా క‌నిపించ‌దు.. ఇది అహంకారం అనిపించ‌వ‌చ్చు.

వీడీ అలా చేయ‌డం అగౌరవ సంజ్ఞగా కనిపిస్తుంది. అయితే దేవరకొండ ఇలా చేసే ముందు క్ష‌ణ‌కాల‌మైనా ఆలోచించలేదు.. త‌డ‌బ‌డ‌లేదు!! చాలా క్యాజువ‌ల్ గా అలా చేశాడు. పాన్ ఇండియా స్టార్ ని ప్ర‌శ్నించ‌డం కొంత ఇబ్బందిక‌రం అని జ‌ర్న‌లిస్టు అన‌డంతోనే అత‌డు ఫీల్ ఫ్రీ మూవ్ మెంట్ కోసం అలా చేశాడు. ఆ స‌మ‌యంలో విజయ్ జర్నలిస్ట్ ని ఫ్రీగా హాయిగా ఉండమని కోరాడు.

ఇది అహంకార‌మా లేక యాధృచ్ఛిక‌మా? అన్న‌ది ఆ స‌న్నివేశం ఏంటో పూర్తిగా చూశాకే నిర్ణ‌యించాలి. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన లైగర్ ఆగస్ట్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు-త‌మిళం-హిందీ-మ‌ల‌యాళం-క‌న్న‌డ‌లో అత్యంత భారీగా విడుద‌ల‌వుతోంది. ప్ర‌స్తుతం ప్ర‌చారం హోరెత్తుతోంది.