Begin typing your search above and press return to search.

నటుడిని కాబట్టి ఇలా..ఊర్లో నేను నా బర్రెలు

By:  Tupaki Desk   |   1 Oct 2018 3:00 PM GMT
నటుడిని కాబట్టి ఇలా..ఊర్లో నేను నా బర్రెలు
X
ఓవర్‌ నైట్‌ స్టార్‌ అయిన విజయ దేవరకొండ వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. నక్కతోక తొక్కి వచ్చినట్టుగా ఈయన చేసిన ప్రతి సినిమా కూడా ప్రేక్షకులకు బాగా కనెక్ట్‌ అవుతుంది. విజయ్‌ తాజా చిత్రం ‘నోటా’ అక్టోబర్‌ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. దాంతో హీరోగారు ప్రమోషన్‌ పనుల్లో బాగా బిజీ అయ్యారు. ఈయన తాజాగా ఓ ఇంటర్య్వూలో పాల్గొని తన కెరియర్‌ గురించి - మంత్రి కేటీఆర్‌ తో తనకు ఉన్న రిలేషన్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

విజయ్‌కు ఉన్న లేడీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ గురించి అడిగిన యాంకర్‌ కు నివ్వెరపోయే సమాధానం ఇచ్చాడు. నటుడిని కాబట్టి నన్ను అంతలా ఇష్టపడుతున్నారు. ఇది నా ప్రొఫెషన్‌ లో ఒక భాగం, ఇట్స్‌ నైస్‌ అంటూ తన చిరునవ్వుతో ఆకట్టుకునే విధంగా సమాధానం చెప్పారు. నేను ఒకవేళ నటుడిని కాకుండా ఏదైనా బ్యాంక్‌ లో జాబ్‌ చేస్తే అక్కడ ఒకరిద్దరు ఇష్టపడేవారు, కానీ నటుడిగా నన్ను అంత పెద్ద స్క్రీన్‌ మీద ప్రపంచ వ్యాప్తంగా చూస్తున్నారు కాబట్టి ఆ మాత్రం ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉండే ఉంటది, అదే నేను ఊర్లో ఉంటే నేను.. నా బర్రొ.. మాత్రమే ఉండేవి - నటుడిని కాబట్టి నాకు వారు త్వరగా కనెక్ట్‌ అవుతారు అని చాలా సింపుల్‌ గా చెప్పేశాడు.

ఇకపోతే తెలంగాణ మంత్రి కేటీఆర్‌ తో తనకున్న రిలేషన్‌ ను కూడా చాలా సింపుల్‌ గా చెప్పేశారు. కేటీఆర్‌ తో తనకున్నది స్నేహం కాదని ఇరువురికి ఒకరిమీద ఒకరికి ఉన్న అభిమానం అలాంటిది అని చెప్పుకొచ్చాడు. నన్ను ఒక నటుడిగా ఆయన ఇష్ట పడతారు - అంతేకాకుండా నేను ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డుని స్టేట్‌ కు ఇవ్వడం రామ్‌ అన్నకు చాలా నచ్చింది. ఇకపోతే నేను ఒక లీడర్‌ గా మరియు ఆయన చేసే పనులను ఇష్ట పడతాను.

సాదారణంగా రాజకీయ నాయకులు కెమెరాల ముందు మాత్రమే సామాజిక భాద్యతతో వ్యవహరిస్తారు కానీ కేటీఆర్‌ అన్న మాత్రం అలా కాదు తన చుట్టూ కెమెరాలు - మనుషులు లేకున్నా కూడా తనకున్న భాద్యతలను నిర్వహిస్తాడు. ఒక లీడర్‌ గా ఆయనకున్న స్వభావం నాకు చాలా ఇష్టం అలా ఇద్దరం పరస్పరం స్నేహితుల్లా మారిపోయాం అంటూ విజయ్‌ చెప్పుకొచ్చాడు.