Begin typing your search above and press return to search.
దేవరకొండకు 25 హీరోయిన్లు నో చెప్పారట
By: Tupaki Desk | 15 Aug 2018 6:06 AM GMTసినిమా అంటేనే రంగుల ప్రపంచం.. ఇక్కడ హిట్ కొడితేనే గుర్తింపు.. అనామక హీరోలతో చేయడానికి ఎవ్వరూ ముందుకురారు.. హిట్ కొడితే మాత్రం మేమున్నామంటూ ముందుకొస్తారు. అందుకే హీరోలు, హీరోయిన్లు తమకు లైఫ్ ఇచ్చిన వారిని ఎప్పుడూ మరిచిపోరు.. తాజాగా ‘అర్జున్ రెడ్డి ’ విజయ్ విషయంలోనూ అదే జరిగింది..
అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరో అయిపోయాడు విజయ్ దేవరకొండ.. ఆ సినిమాతోపాటే మొదలు పెట్టిన ‘గీతాగోవిందం’ సినిమా తాజాగా రిలీజ్ కు సిద్ధమవుతోంది. మరి ఇన్ని రోజులు ఎందుకు లేట్ అయ్యిందనే విషయాన్ని తాజాగా ఆ మూవీ డైరెక్టర్ పరుశురామ్ ప్రేక్షకులతో పంచుకున్నారు.
గీతాగోవిందం మూవీ డైరెక్టర్ పరుశురామ్ మాట్లాడుతూ ‘అర్జున్ రెడ్డికి ముందే సినిమాను ప్లాన్ చేశాను.. కానీ విజయ్ కు అంతకుముందు పెద్దగా ఇమేజ్ లేకపోవడంతో ఇతడితో నటించడానికి ఏ హీరోయిన్ ఆసక్తి చూపలేదు. దాదాపు 25మంది హీరోయిన్లను సంప్రదించినా ఓకే కాలేదు. చివరకు రష్మిక మందానా గీతాగోవిందంలో హీరోయిన్ పాత్ర చేయడానికి ఒప్పుకుంది. కథ చెప్పాక గీత పాత్ర రష్మిక కోసమే పుట్టిందనిపించింది. ఈ సినిమాలో గీతగా రష్మీక జీవించింది. విజయ్-రష్మిక కెమెస్ట్రీనే సినిమాకు ప్రధాన ఆకర్షణ.. తాను ఇంతకుముందు తీసిన సినిమాలకంటే ‘గీతగోవిందం’ నా జీవితంలో తొలి బ్లాక్ బస్టర్ అవుతుంది ’ అని ధీమా వ్యక్తం చేశారు.
ఇలా అర్జున్ రెడ్డి లాంటి బంపర్ హిట్ కొట్టిన విజయ్ కు ఆ స్టార్ డం రాకముందు అతడితో నటించడానికి ఏ హీరోయిన్ ముందుకు రాలేదనే విషయం తాజాగా సంచలనమైంది. సినిమా ఇండస్ట్రీలో హిట్ తో పాటే క్రేజ్ అన్న విషయం దీన్ని బట్టి నిరూపితమైంది.