Begin typing your search above and press return to search.

నేను సౌత్ లో చేసుకుంటాలే సార్

By:  Tupaki Desk   |   13 March 2018 7:27 AM GMT
నేను సౌత్ లో చేసుకుంటాలే సార్
X
కొంత మంది దర్శకుల చేతిలో పడితే ఎలాంటి హీరోలైన నటనలో రాటు దేలుతారు అనేది వాస్తవం. నటీనటుల బాడీ లాంగ్వేజ్ ని బట్టి పాత్రలను క్రియేట్ చేసేవారు కొంత మంది ఉంటే పాత్రలోకి పరకాయ ప్రవేశాన్ని చేయించడంలో మరికొంత దర్శకులు ది బెస్ట్. అలాంటి వారిలో విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఉన్నాడని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వర్మ చేతిలో పడితే సక్సెస్ రాకున్నా నటనలో కొత్త విషయాలు నేర్చుకోవచ్చు అని చాలామంది ఆలోచిస్తుంటారు.

జగపతి బాబు వాయిస్ బాగోలేదని మొదట్లో ఆయనకు వాయిస్ ఓవర్ ఇప్పించేవారు. కానీ వర్మ గాయం సినిమాలో జగపతికి వాయిస్ ఓవర్ అవసరం లేదని చెప్పి సినిమాకు జగపతి వాయిస్ హైలెట్ అయ్యేలా చేశాడు. ఇక చక్రవర్తి లాంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ తో ప్రయోగాలు చేసి బాలీవుడ్ లోకి కూడా తీసుకెళ్లాడు. సత్య సినిమా అప్పట్లో హిందీ బాక్స్ ఆఫీస్ హిట్. అదే తరహాలో విజయ్ దేవరకొండను కూడా వర్మ నార్త్ సైడ్ తీసుకెళ్లాలని అనుకున్నాడట. కానీ మనోడు మాత్రం సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది.

అర్జున్ రెడ్డి సినిమా ప్రమోషన్స్ లో వర్మకు కూడా చాలా క్రెడిట్ ఉంది. సినిమా సక్సెస్ లో అయన కీలక పాత్ర పోషించారు. విజయ్ ని బాలీవుడ్ కి తీసుకెళ్లాలని కామెంట్స్ కూడా చేశాడు. కానీ దేవరకొండకు వర్మతో ప్రయోగం చేయడం ఇష్టం లేదని టాక్. అందుకే సింపుల్ గా.. సార్ నేను సౌత్ లో చేసుకుంటూ.. హిందీ సంగతి తరువాత చూద్దాం అని చెప్పేశాడట. ఇక ప్రస్తుతం వర్మ ఆఫీసర్ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తరువాత లక్మిస్ ఎన్టీఆర్ తీయాలని అనుకున్నప్పటికీ ఆ సినిమాకు బ్రేక్ పడింది. మరి వర్మ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో ఉంటుందో చూడాలి.