Begin typing your search above and press return to search.

అర్జున్ రెడ్డికి విజయ్ పారితోషకం ఇంతేనా?

By:  Tupaki Desk   |   18 July 2018 11:25 AM GMT
అర్జున్ రెడ్డికి విజయ్ పారితోషకం ఇంతేనా?
X
అర్జున్ రెడ్డి సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేశాడు విజయ్ దేవరకొండ.. చిన్న సినిమాగా వచ్చిన ఈ అడల్ట్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. కేవలం 4 కోట్ల బడ్జెట్ తో మూవీ తీస్తే.. పదిరెట్లు లాభాలు వచ్చిపడ్డాయని చెప్పుకుంటారు. ఈ చిత్ర దర్శకుడు సందీప్ వంగ సొంతంగా నిర్మించడంతో భారీగా లాభపడ్డాడట. చిత్రం రిమేక్ - డిజిటల్ - శాటిలైట్ హక్కుల అమ్మకం ద్వారా కోట్లు వచ్చిపడ్డాయని ఫిలింనగర్ టాక్.

అయితే అర్జున్ రెడ్డి సినిమాకు ముందు విజయ్ ఓ అనామక హీరోనే.. పెళ్లిచూపులు సినిమాతో అప్పుడే హీరోగా గుర్తింపుపొందాడు. ఇక ఆ తర్వాత అర్జున్ రెడ్డిలో నటించినందుకు గాను కేవలం రూ.5 లక్షలే తీసుకున్నట్టు విజయ్ తెలిపాడు. ఐతే విడుదల తర్వాత సినిమాకు భారీ లాభాలు రావడంతో అందులోంచి తనకు వాటాగా భారీగా డబ్బు వచ్చిందని వివరించాడు.

విజయ్ ఈ విషయాలను స్వయంగా వెల్లడించాడు. ఇటీవలే ‘రౌడీ’ పేరుతో అపారెల్ బ్రాండ్ ను ఆవిష్కరించిన సందర్భంగా అర్జున్ రెడ్డి పారితోషకం గురించి అడిగితే ఈ సంచలన నిజం చెప్పాడు. విజయ్ అర్జున్ రెడ్డి సినిమాకు కేవలం 5 లక్షలు తీసుకున్నాడని తెలిసి అంతా అవాక్కయ్యారు. అయితే సందీప్ వంగ ఆర్థిక పరిస్థితి చూసే అంత తక్కువ తీసుకున్నానని చెప్పడంతో ఈ హీరో గొప్పతనాన్ని ఇప్పుడు అందరూ పొగుడుతున్నారు.