Begin typing your search above and press return to search.
లిప్ లాక్ ఇష్యూలో ప్రేక్షకులకు రౌడీ రిక్వెస్ట్
By: Tupaki Desk | 19 July 2019 6:39 AM GMTవిజయ్ దేవరకొండ 'డియర్ కామ్రేడ్' చిత్రంతో మరి కొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ చిత్రంలో రష్మికతో విజయ్ దేవరకొండ చేసిన లిప్ లాక్ సీన్స్ గురించి ప్రస్తుతం సౌత్ ఇండియా మొత్తం చర్చ జరుగుతోంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం మరియు కన్నడ భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతున్న నేపథ్యంలో ముద్దు సీన్ గురించి అక్కడ కూడా రచ్చ రచ్చగా చర్చ జరుగుతోంది. గీత గోవిందంలో ముద్దు సీన్ తో మెప్పించిన వీరిద్దరు ఈసారి మరింతగా రెచ్చి పోయినట్లుగా ట్రైలర్ చూస్తుంటే అర్థం అవుతుంది.
ముద్దు సీన్స్ గురించి ఒక తమిళ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ కాస్త ఎమోషనల్ అయ్యాడు. మా సినిమా చూసేందుకు వచ్చే ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు కొన్ని సార్లు ఇలాంటివి చేయక తప్పడం లేదు. ముద్దు సీన్స్ వల్ల మా వ్యక్తిగత జీవితాలు ఇబ్బందులకు గురవుతున్నాయి. ఈ సీన్స్ చేస్తే కొందరు మా గురించి తప్పుగా మాట్లాడుకోవడంతో పాటు కొందరు అసహ్యంగా కామెంట్స్ కూడా చేస్తున్నారు. మమ్ములను తప్పుగా అర్థం చేసుకోవడంతో పాటు ఇష్టం వచ్చినట్లుగా ప్రచారం చేస్తున్నారు.
సినిమాల్లో మేము చేసిన సీన్స్ ను బట్టి మా నిజ జీవితం గురించి తప్పుగా మాట్లాడుకోవడం జరుగుతుంది. ఒక సినిమా అనేది మాకు భవిష్యత్తు.. నిర్మాత కోట్ల డబ్బు.. దర్శకుడి జీవితం ఉంటుంది. అందుకే తామంతా కూడా ప్రేక్షకులను మెప్పించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తాం. సినిమా కోసం చాలా కష్టపడతాం. అన్ని విధాలుగా ఇబ్బందులను ఎదుర్కొంటాం. సినిమా విడుదలైన తర్వాత ఆ బాధలన్నింటిని మర్చి పోతాం. అందుకే మీరు కూడా సినిమాను సినిమా మాదిరిగానే చూడండి. అందులో సీన్స్ ను మా వ్యక్తిగత జీవితాలకు ముడి పెట్టవద్దంటూ విజయ్ దేవరకొండ రిక్వెస్ట్ చేశాడు. ఇండైరెక్ట్ గా విజయ్ దేవరకొండ కొన్ని రోజులుగా వస్తున్న రష్మికతో ఎఫైర్ నిజం కాదని చెప్పే ప్రయత్నం చేశాడు.