Begin typing your search above and press return to search.

పెళ్లి చూపులు హీరో కొట్టిపారేశాడే!!

By:  Tupaki Desk   |   4 Jun 2017 7:23 AM GMT
పెళ్లి చూపులు హీరో కొట్టిపారేశాడే!!
X
పెళ్లి చూపులు హీరో విజయ్ దేవరకొండ ఇప్పుడు టాలీవుడ్ న్యూస్ లో ఎక్కువగా వినిపిస్తున్నాడు. అతని కొత్త సినిమా అర్జున్ రెడ్డి ప్రమోషన్లు గురించి కాదులెండి. అతని ప్రేమ పెళ్లి విషయం గురించి ఊహగానాలు తెగ వినబడుతున్నాయి ఈ మధ్య. కొన్ని వారపత్రికలు అయితే అతనుకు పెళ్లి కూడా చేసేశారు. ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నట్లు ఉంది ఈ వ్యవహారం.

విజయ్ కు విమ్మి అనే పాత గర్ల్ ఫ్రెండ్ ఉందని, ఆమెనే ఇప్పుడు పెళ్లిచేసుకోబోతున్నాడు అంటూ ఒక ఇంగ్లీష్ పత్రికలో న్యూస్ వచ్చినట్లు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఈ విషయం విజయ్ కు తెలిసేసారికి కొంచం ఆలస్యం అయ్యిందట. మనోడు ఇప్పుడు ఏమంటున్నాడంటే.. “నేను ఇప్పుడు ఇంగ్లాండ్ లో ఉంటే ఇండియా లో నా పెళ్లి ఎలా చేస్తారు మీరు? బాగుంది మీ హరికథ వినడానకి. ఇంకోటి మీరు మరిచిపోయారు నా ఇద్దరు పిల్లలు రుమ్మి, డుమ్మి గురించి చెప్పడం. వాళ్ళ మమ్మీ విమ్మి ని కూడా అడిగినట్లు చెప్పండి. నా శుభాకాంక్షలు తెలియపరచండి'' అంటూ తన ఫేస్ బుక్ లో ఫన్నీ గా పోస్ట్ చేశాడు ఈ కుర్ర హీరో.

అసలు ఈ న్యూస్ ఎలా వచ్చిందో ఎందుకువచ్చిందో అయితే నాకు తెలియదు నాకు దీనికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేశాడు. విజయ్ దేవరకొండ ఇప్పుడు తన తాజా చిత్రం అర్జున్ రెడ్డి తో తన భవితను నిర్మించుకోబోతున్నాడు. ఈ సినిమాను సందీప్ రెడ్డి దర్శకత్వం చేస్తున్నారు. ఆ తరువాత పరశురామ్ డైరక్షన్లో గీతా ఆర్ట్స్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/