Begin typing your search above and press return to search.
'గోవిందు' డు అల్లరి వాడేనట!
By: Tupaki Desk | 14 Aug 2018 3:30 PM GMT`అర్జున్ రెడ్డి`చిత్రంలో టాలీవుడ్ లో మరో యంగ్ సూపర్ స్టార్ గా విజయ్ దేవరకొండ అవతరించిన సంగతి తెలిసిందే. అర్జున్ రెడ్డిగా విమర్శకులను, సెలబ్రిటీలను, ప్రేక్షకులను ఆకట్టుకున్న విజయ్....రేపు `గీత గోవిందం`తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఓ పక్క లీకులు చిత్ర యూనిట్ ను కలవరపెట్టినప్పటికీ....విజయ్ కు ఉన్న క్రేజ్...గీతా ఆర్ట్స్ పై ఉన్న నమ్మకం ఆ సినిమాపై పాజిటివ్ బజ్ ను కంటిన్యూ చేస్తున్నాయి. గత మూడు నెలల్లో ఏ సినిమాకు రాని అడ్వాన్స్ బుకింగ్స్ ఈ సినిమాకు అయ్యాయంటే మూవీపై ఆడియన్స్ కి ఎన్ని హోప్స్ ఉన్నాయో స్పష్టమవుతోంది. అయితే, అర్జున్ రెడ్డిగా రా అండ్ బోల్డ్ క్యారెక్టర్ లో అలరించిన విజయ్...ఈ సినిమాలో ఏ తరహా లవర్ బాయ్ గా కనిపించబోతున్నాడని ఫ్యాన్స్ ఎగ్జయిట్ అవుతున్నారు. అందుకే, తాజాగా గోవింద్ పాత్ర గురించి విజయ్ స్వయంగా రివీల్ చేశాడు.
ఈ సినిమాలో తాను ఓ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పాత్రలో కనిపిస్తానని విజయ్ చెప్పాడు. గోవిందానికి .. అర్జున్ రెడ్డికి మధ్య కొన్ని పోలికలున్నాయని అన్నాడు. ప్రేమ కోసం 'అర్జున్ రెడ్డి' ఎంత దూరమైనా వెళతాడని, 'గోవిందం' కూడా అదే టైపని అన్నాడు. ప్రేమ విషయంలో .. ప్రేమను సాధించుకునే విషయంలో ఇద్దరూ దాదాపుగా ఒకటేనన్నాడు. తన రౌడీస్...ఫ్యాన్స్ ...తో పాటు ప్రేక్షకులు ఆశించినట్లుగానే ఈ సినిమా ఉంటుందన్నాడు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకుంటుందని తనకు నమ్మకం ఉందన్నాడు. ఈ తరహా సినిమాను తనతో పట్టుబట్టి చేయించిన ఘనత బన్నీవాసుగారిదేనని, దర్శకుడు పరశురామ్ తన పాత్ర విషయంలో చాలా కేర్ తీసుకున్నారని అన్నాడు. మరి, స్టూడెంట్ నుంచి ప్రొఫెసర్ గా మారిన `అర్జున్ రెడ్డి` ప్రేక్షకులను ఏవిధంగా అలరించబోతున్నాడో తెలియాలంటే కొన్ని గంటలు వెయిట్ చేయక తప్పదు.