Begin typing your search above and press return to search.

విమానాలు త‌ప్ప ఇల్లు మ‌రిచాడ‌ట‌

By:  Tupaki Desk   |   25 July 2019 4:53 AM GMT
విమానాలు త‌ప్ప ఇల్లు మ‌రిచాడ‌ట‌
X
గ‌త కొంత‌కాలంగా విజ‌య్ దేవ‌ర‌కొండ `డియ‌ర్ కామ్రేడ్` ప్ర‌మోష‌న్స్ లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. గీతా (ర‌ష్మిక) స‌మేతుడై కామ్రేడ్ చేస్తున్న సంద‌డి మామూలుగా లేదు. గీత‌- గోవిందు క‌లిసి `డియ‌ర్ కామ్రేడ్` ప్ర‌మోష‌న్స్ ని చేస్తుంటే అభిమానుల‌కు క‌న్నుల పండువ‌గా ఉంది. మ్యూజిక్ ఫెస్టివ‌ల్స్ పేరుతో ఇప్ప‌టికే అన్ని మెట్రో న‌గ‌రాల్ని చుట్టేశారు. చిట్ట‌చివ‌రిగా వైజాగ్ లో ఫైన‌ల్ డెస్టినేష‌న్ కి వ‌చ్చామ‌ని దేవ‌ర‌కొండ నిన్న‌టి సాయంత్రం బీచ్ సొగ‌సుల విశాఖ వాసుల‌కు తెలిపారు. విశాఖపట్నం బీచ్‌రోడ్డులోని నోవాటెల్‌‌ హోటల్లో డియర్‌ కామ్రేడ్‌ చిత్ర బృందం బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించింది.

ఈ కార్య‌క్ర‌మంలో దేవ‌ర‌కొండ మాట్లాడుతూ ఇటీవ‌ల త‌న వ‌ర్క్ స్ట్రెస్ గురించి రివీల్ చేశారు. ``గ‌త‌ ప‌ది రోజులుగా ఇంటి ఇంటీరియ‌ర్స్ కంటే ఎయిర్ పోర్ట్ ఇంటీరియ‌ర్స్ నే ఎక్కువ‌గా చూస్తున్నా. విమానాశ్ర‌యంలోనే టిఫిన్ తిన‌డం భోజ‌నం తిన‌డం చేస్తున్నాం. అన్ని న‌గ‌రాల్ని చుట్టేశాం. చెన్న‌య్-బెంగ‌ళూరు-హైద‌రాబాద్ అన్నీ తిరిగేశాం. ముంబైలోనూ అడుగు పెట్టేశాం. చివ‌రిగా వైజాగ్ లోనే మీటింగ్. ఇక్క‌డే మా ఫైన‌ల్ డెస్టినేష‌న్`` అంటూ జోవియ‌ల్ గా మాట్లాడేస్తూ కామ్రేడ్ ఆక‌ట్టుకున్నారు.

అస‌లింత‌కీ కామ్రేడ్ అంటే అర్థం ఏమిటి? అన్న‌దానికి దేవ‌ర‌కొండ స‌మాధానం ఇచ్చారు. ``అప్ప‌ట్లో కమ్యూనిస్టులతో పాటు ఆర్మీలోనూ కామ్రేడ్‌ అనే పదం వాడేవారు. అందుకే మా సినిమాకు డియర్‌ కామ్రేడ్‌ అనే పేరు పెట్టాం. దేశం కోసం ఆర్మీ జ‌వాన్ పోరాటం ఎలానో.. ప్రేమికురాలి కోసం .. స‌మ‌స్య‌లపైనా పోరాటం సాగించే కామ్రేడ్ క‌థే ఈ సినిమా`` అని తెలిపారు. కష్టకాలంలో ఆదుకునేవాడే కామ్రేడ్‌. ఈ నెల 26న నాలుగు భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నామ‌ని అన్నారు. రష్మిక మాట్లాడుతూ ఈ చిత్రంలో నేను క్రికెటర్‌గా కనిపించేందుకు ఐదు నెలల పాటు శిక్షణ తీసుకున్నాన‌ని వెల్ల‌డించారు.