Begin typing your search above and press return to search.
'తుఫాన్' ఎలా ఉంటుందో చూపిస్తానంటున్న రౌడీ VD..!
By: Tupaki Desk | 31 Jan 2022 9:30 AM GMTసెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. 'పెళ్లి చూపులు' సినిమాతో హీరోగా పరిచయమైన VD.. 'అర్జున్ రెడ్డి' చిత్రంతో యూత్ లో భారీ ఫాలోయింగ్ ఏర్పరచుకొని ఎమర్జింగ్ స్టార్ గా అవతరించాడు. ఈ క్రమంలో సినిమా సినిమాకు తన స్టార్ ఇమేజ్ పెంచుకుంటూ వెళ్తున్నాడు. 'లైగర్' మూవీ రిలీజ్ అవకుండానే, పాన్ ఇండియా హీరోగా పిలవబడుతున్నాడంటేనే ప్రస్తుతం రౌడీ బాయ్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఆన్ స్క్రీన్ లోనే కాకుండా ఆఫ్ స్క్రీన్ లోనూ విజయ్ దేవరకొండ తన యాటిట్యూడ్ తో అందరిలో స్పెషల్ గా నిలిచాడు. యూత్ కి స్టైల్ ఐకాన్ గా మారిపోయిన వీడీకి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఇన్స్టాగ్రామ్ - ఫేస్ బుక్ - ట్విట్టర్ లలో విజయ్ ను మిలియన్ల కొలదీ ఫాలోవర్స్ తో సరికొత్త రికార్డులు క్రియేట్ చేశారు. అయితే రౌడీ బాయ్ విజయ్ తాజాగా సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ప్రొఫైల్ నేమ్ కు ''తుఫాన్'' ని జోడించారు.
విజయ్ దేవరకొండ ఇప్పుడు ఉన్నట్టుండి సామాజిక మాధ్యమాల్లో తన పేరుకు 'తూఫాన్'(TOOFAN) అని యాడ్ చేయడం ఫ్యాన్స్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఏదైనా బిగ్ అనౌన్స్ మెంట్ ఇవ్వబోతున్నారా? అని అందరూ క్రేజీగా ఫీల్ అయ్యారు. VD ఏం చెప్పబోతున్నాడు? అసలు ఏమి జరగబోతోంది? అని తెలుసుకోవాలనే ఉత్సాహం అభిమానుల్లో ఎక్కువైంది. ఈ క్రమంలో విజయ్ కూల్ డ్రింగ్ బాటిల్ ని పట్టుకున్న ఓ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందులో ‘సాఫ్ట్ డ్రింక్ కాదు.. ఇది తూఫాన్’ అని పేర్కొనబడింది.
దీంతో 'తుఫాన్' అనేది 'థమ్స్ అప్' కు సంబంధించిన యాడ్ లో భాగమని అర్థం అయింది. విజయ్ దేవరకొండ ప్రముఖ శీతలపానీయం సంస్థ కోకా కోలాకు చెందిన 'థమ్స్ అప్' కి ప్రచారం చేయబోతున్నారని తెలుస్తోంది. ఇండియాలో ఇప్పటికే ఎంతో మంది పాపులర్ స్టార్స్ తో ఒప్పందాలు కుదుర్చుకున్న థమ్స్ అప్.. ఈసారి తమ బ్రాండ్ అంబాసిడర్ గా యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండను ను నియమించుకున్నట్లు సందేహాలు కలుగుతున్నాయి.
ఏదేమైనా విజయ్ దేవరకొండ తన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో నేమ్ మార్చడం.. ‘సాఫ్ట్ డ్రింక్ కాదు, ఇది తూఫాన్’(Soft Drink Kaadu, idi Toofan) అని పేర్కొనడంతో నెట్టింట దీని గురించి పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. దీంతో ఈ టాపిక్ నేషనల్ వైడ్ ట్రెండింగ్ లో ఉంది. విజయ్ చూపిస్తానంటున్న 'తూఫాన్' ఎలా ఉండబోతుందో రాబోయే రోజుల్లో తెలుస్తుంది.