Begin typing your search above and press return to search.
థియేటర్ ఓనర్ తో దేవరకొండ సెల్పీ..శాంతించినట్లే!
By: Tupaki Desk | 28 Aug 2022 11:20 AM GMTరౌడీస్టార్ విజయ్ దేవరకొండ `లైగర్` పై చేసిన కామెంట్లు కొందరిని ఆగ్రహానికి గురిచేసిన సంగతి తెలిసిందే. `లైగర్` ని బోయ్ కట్ చేస్తారా? బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి? చూసుకుందాం అంటూ కౌంటర్ గా ప్రతిస్పందించాడు విజయ్. దీంతో సీన్ ఒక్కసారిగా వెడెక్కింది. అటుపై రిలీజ్ తర్వాత లైగర్ ఎలాంటి ఫలితాలు సాధించిందో తెలిసిందే.
భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమా తొలి షోతోనే సంగతేంటో తెలిపోయింది. దీంతో ముంబైలోని థియూటర్ యజమాని మనోజ్ దేశాయ్ విజయ్ పై మండిపడ్డారు. ఉత్తరాది థియేటర్లు అన్ని ఖాళీ అయిపోవడానికి కారణం విజయ్ చేసిన వ్యాఖ్యలే..ఆయన నోటి దురుసుకు తగ్గించుకోవాలంటూ హెచ్చరించారు. తన వల్ల సినిమాకి రావాల్సిన కనీస వసూళ్ల కూడా రాలేదని మండిపడ్డారు.
తాజాగా విజయ్ దేవరకొండ ముంబైలో నేడు ప్రత్యక్షమయ్యాడు. మనోజ్ దేశాయ్ ని కలిసి తలెత్తిన మన్పసర్ధల్ని తొలగించుకునే ప్రయత్నం చేసాడు. ఆయనతో పాటు కలిసి దిగిన ఓ ఫోటోని షేర్ చేసి విషయాన్ని రివీల్ చేసాడు. ఇకపై మంచి సినిమాలు చేస్తానని..తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకున్నట్లుగా సంకేతాలిచ్చాడు. దీంతో మనోజ్ దేశాయ్ కూడా శాంతిచినట్లు కనిపిస్తుంది. మంచి సినిమాలు చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
ఆవేశం అనర్ధాలకు దారి తీస్తుందని విజయ్ కి ఇప్పటికే అర్ధమై ఉంటుందని నెటి జనులు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. లైగర్ సినిమా ఎలా ఉంది? అన్న సంగతి పక్కనబెడితే విజయ్ చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ లో గట్టిగానే ప్రభావం చూపినట్లు కనిపిస్తుంది. మిస్టర్ పర్ పెక్ట్ నిస్ట్ అమీర్ ఖాన్ ఇలాంటి వాటిని ఫేస్ చేయలేకపోయారు. ఇటీవల రిలీజ్ అయిన లాల్ సింగ్ చడ్డాని బోయ్ కట్ చేస్తామని ముందుగానే హెచ్చరించారు. అది చేసి చూపించారు. ఫలితంగా 50 కోట్లు సాధించాల్సిన సినిమా మొదటి రోజు 12 కోట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.