Begin typing your search above and press return to search.

'నాకు ఇష్టంలేనిదే రొమాన్స్' అంటున్న విజయ్ దేవరకొండ..

By:  Tupaki Desk   |   18 March 2020 9:45 AM GMT
నాకు ఇష్టంలేనిదే రొమాన్స్ అంటున్న విజయ్ దేవరకొండ..
X
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ తో, డైలాగ్ డెలివరీ తో అభిమానులకు చేరువైన యంగ్ హీరో విజయ్ దేవరకొండ. హిట్లు ప్లాపులు పక్కన పెట్టి వరుస సినిమాల తో దూసుకుపోతున్నాడు. అయితే రీసెంట్ గా నిర్వహించిన 'మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ ఆఫ్ 2019'గా అరుదైన ఘనత సాధించాడు. విజయ్ మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ గా నిలవడం ఇది రెండోసారి. ఇండస్ట్రీలోకి వచ్చిన కొద్దీ కాలంలోనే మంచి పేరును, భారీ సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్నాడు. వరుసగా రెండోసారి కూడా పెద్ద హీరోలను పక్కకు నెట్టి ఈ ఫీట్ సాధించడం విశేషం.

అయితే మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ గా ఎంపికైన విజయ్ తన గురించి తెలిపిన విషయాలు మాత్రం కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. "మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ గా నన్ను అభిమానులు ఎంచుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. నాపై వారు చూపిస్తున్న ప్రేమకు నేను దాసుడిని. నేను ఏది చేసినా జనాలు ఆదరిస్తున్నారు అంటే వాళ్ళకి నచ్చేదే నేను చేస్తున్నానని నాకు అన్పిస్తుంది. అందుకే ప్రేక్షకులు నన్ను ఇంతలా ఆదరిస్తున్నారు. అందరూ అనుకుంటున్నట్లు నేనెప్పుడూ కూడా అమ్మాయిలను ఆకర్షించేలా మాట్లాడలేదు.

ఎందుకంటే అమ్మాయిలతో డేటింగ్ కంటే కూడా నాకు ఫ్రెండ్ లా ఉండటమే ఇష్టం అంటున్నాడు ఈ కుర్రహీరో. నాకు రొమాన్స్ అంటే కూడా ఇష్టం ఉండదు. నాకు కూడా జీవితంలో సరైన జోడి దొరికితే అదే డేటింగ్, అదే రొమాన్స్. అంతేగాక ఒక అమ్మాయిని చూస్తే అట్ట్రాక్ట్ అవ్వాలి అప్పుడే నేను వాళ్ళ తో కలవగలుగుతాను. అయినా నేను ఇప్పుడు మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ తో పాటు ఫ్యామిలీ మ్యాన్ గా అభిమానుల గుండెల్లో ఉండాలని అనుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు డాక్టర్ అర్జున్ రెడ్డి ఫేమ్ యాక్టర్ విజయ్ దేవరకొండ.