Begin typing your search above and press return to search.
రౌడీస్ మనం రూల్స్ పెట్టుకుందాం: విజయ్
By: Tupaki Desk | 3 Oct 2018 1:26 PM GMTటాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ తాజా చిత్రం 'నోటా' మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. 'నోటా' కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సమయంలోనే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కు మధ్య సోషల్ మీడియాలో కాస్త హంగామా కూడా జరిగింది. ఇక సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అన్న తర్వాత తిట్టుకోవడాలు కామనే కదా. ఒకవైపు విజయ్ దేవరకొండ తారక్ 'అన్న' అని సంభోదిస్తూ .. తన వర్క్ అన్నకు నచ్చిందని.. మెచ్చుకున్నాడని ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు. అదే సమయంలో 'నోటా' ను 'అరవింద సమేత' రిలీజ్ సమయంలో పోటీగా రిలీజ్ చేయొద్దని కొందరు ఫ్యాన్స్ చెప్పడం తనకు నచ్చలేదని నిర్మొహమాటంగా చెప్పాడు.
మరి ఈ ఎపిసోడ్లో తన అభిమానుల ప్రవర్తనను కాస్త దారిలో పెట్టాలని భావించాడో ఏమో గానీ ట్విట్టర్ లో పెద్ద మెసేజ్ పెట్టాడు. "మన సంఖ్య పెరిగేకొద్దీ మనం కొన్ని నియమాలు ఏర్పరుచుకోవాలి. మనం యువకులం కాబట్టి ఈ మార్పుకు శ్రీకారం చుట్టగలం" అని ట్వీట్ చేస్తూ ఒక టెక్స్ట్ ఇమేజ్ పెట్టాడు.
"హే రౌడీలు.. మనం మార్పు తీసుకొస్తున్నాం. అది సినిమా కానివ్వండి.. జీవిత విధానం కానివ్వండి.. రౌడీ కల్చర్ కానివ్వండి..లేదా మనం మనలాగే ఉండాలన్న యాటిట్యూడ్ కానివ్వండి. ఒక సోషల్ మీడియా పాజిటివిటి ట్రెండ్ సెట్ చేసే సమయం వచ్చింది.
మీలో చాలామంది నా ఫోటోను ప్రేమతో మీ డీపీగా పెట్టుకున్నారు కానీ మీరు ఇతరులతో వాదులాడడం నేను గమనించాను. నేను అలా చేయను..కాబట్టి మీరు కూడా అలా చెయ్యొద్దు. అది కష్టమని నాకు తెలుసు కానీ ఇప్పటివరకూ నేను సాధించింది అంతా నేను నాపై దృష్టి పెట్టి నా జీవితం పై ఫోకస్ చేసి సాధించినదే. నేను ఇతరుల గురించి పట్టించుకోను. లివ్ అండ్ లెట్ లివ్.
ఒకవేళ ఎవారైనా మనల్ని ద్వేషించినా వారిని మంచిగానే పలకరించండి.. సంతోషంగా ఉండండి. మీరు దిగులు పడాల్సిన అవసరమే లేదు. నేను ఎప్పుడూ మీకు మంచి సినిమాలు అందిస్తాను.. గొప్ప బట్టలు.. ఇంకా చాలా చాలా.. కానీ నేనుమాత్రం ఈ ఆన్ లైన్ గొడవలు చూడదలుచుకోవడం లేదు. ఫుల్ చిల్ అండ్ లవ్."