Begin typing your search above and press return to search.
అర్జున్ రెడ్డి షాపింగ్ చేశాడు
By: Tupaki Desk | 9 Feb 2018 4:21 AM GMTఅర్జున్ రెడ్డి సినిమాతో యూత్ ను బాగా ఆకట్టుకున్నాడు యంగ్ హీరో విజయ్ దేవరకొండ. ఈ సినిమా అతడి కెరీర్ కు పెద్ద బ్రేక్ నివ్వడమే కాదు.. ఒక పాత్ బ్రేకింగ్ సినిమాగా నిలిచిపోయింది. ఈ సినిమా తరవాత విజయ్ దేవరకొండకు సినిమాలతోపాటు మోడల్ గానూ బ్రహ్మాండమైన అవకాశాలొచ్చాయి. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ ఉండి యూత్ ను తరచూ పలకరిస్తూ వాళ్లను ఖుషీ చేస్తుంటాడు విజయ్.
తాజాగా విజయ్ దేవరకొండ స్వయంగా షాపింగ్ చేస్తూ ఓ వీడియో ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. హీరో షాపింగ్ చేయడంలో వింతేమీ ఉండకపోవచ్చు కానీ.. అతడు కొనింది చిప్స్ ప్యాకెట్లు.. లేస్.. కుర్ కురే లాంటి తినుబండారాలు. అవి ఒకటి రెండు కాదు.. పొట్లాలకు పొట్లాలు స్వయంగా సూపర్ మార్కెట్ అంతా తిరిగి ఏరుకొచ్చాడు. ఇదంతా ఎందుకయ్యే అంటే హాస్టల్ లో ఉండే కుర్రాళ్ల కోసమట. తన యంగ్ ఏజ్ ఎక్కువగా హాస్టల్ లోనే గడించిందని.. తన లైఫ్ లోని హ్యాపీ మూమెంట్స్ లో అది కూడా ఒకటని షేర్ చేసుకున్నాడు. హాస్టల్ జీవితంలో అతి పెద్ద కొరత ఫుడ్డేనని.. చదువుకునే సమయంలో ఆకలి వేస్తే కాస్త కరకర నములతూ తినడానికి ఏమీ దొరికేది కాదని అంటున్నాడు. ఆదివారమైతే ఈ బాధ మరీ ఎక్కువగా ఉండేదని గుర్తు చేసుకున్నాడు.
అందుకే భారత్ యూనివర్సిటీలోని మెరైన్ హాస్టల్ లో తనకు తెలిసిన కుర్రాళ్ల కోసమని రకరకాల తినుబండారాలు కొని పంపించాడు విజయ్. తాను తినాలనుకున్నప్పుడు ఏమేమి అనుకున్నాడో దాదాపుగా అన్ని వైరైటీలు సెలక్ట్ చేసి మరీ షాపింగ్ చేశాడు. ఏదైనా సినిమాలతోనే కాదబ్బా.. షాపింగ్ చేసి కూడా విజయ్ దేవరకొండ యూత్ ను అట్రాక్ట్ చేస్తున్నాడు.