Begin typing your search above and press return to search.
శృతిమించిన అర్జున్ రెడ్డి బూతులు
By: Tupaki Desk | 22 Aug 2017 5:56 AM GMTఇప్పుడున్న హీరోలకు సినిమాను ప్రమోట్ చేయాలంటే ఎగ్రెసివ్ గా ఏదో ఒకటి చెప్పేయాలనే ఊహ ప్రతిరోజూ వస్తుంటుంది. అందుకే చాలామంది హద్దులు దాటేసి నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తారు. ఒక్కోసారి ఆ మాటలు సినిమాకు ప్లస్ అవుతాయ్ కాని.. కెరియర్ కు మాత్రం మైనస్ అయిపోతాయ్. అదిగో ఇప్పుడు ''అర్జున్ రెడ్డి'' హీరో విజయ్ దేవరకొండ పరిస్థితి అలాగే ఉంది.
గత రాత్రి జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్లో మాట్లాడిన విజయ్ దేవరకొండ.. అసలు తాను గతంలో చేసిన కామెంట్స్ ఎందుకు చాలామందికి నచ్చలేదో అర్ధంకాలేదన్నాడు. అప్పట్లో ట్రైలర్ లాంచ్ అప్పుడు.. మనోడు తన సినిమాను మీద ఉన్న పైసలన్నీ బెట్ పెట్టేస్తానని.. అంత బాగా వచ్చిందని చెప్పాడులే. దానితో అందరూ ఇతగాడికి బాగా ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నారు. దానికి ఇప్పుడు ఏమంటున్నాడంటే.. ''f*ck.. నేను ఎవ్వరికీ అపాలజీ చెప్పను. నా సినిమా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉండకపోతే ఎవరికి ఉంటుంది? మీరు (అక్కడకు వచ్చిన స్టూడెంట్స్ ను ఉద్దేశించి) కూడా మీ లైఫ్ లో అలాగే ఉండండి. నేనేంటే కేవలం యాక్టర్ ను.. మీరు ఇంజనీర్లు డాక్టర్లు.. కాబట్టి మీరు ఎవ్వరికీ తలవంచాల్సిన అవసరం లేదు. వినయపూర్వకంగా ఉండాల్సిన అవసరం అంతకంటే లేదు.. f*ck హుమిలిటి'' అంటూ కామెంట్ చేశాడు విజయ్.
అదే విధంగా సెన్సార్ బోర్డు వారు మా---ద్ అనే పదాన్ని మ్యూట్ చేయడం గురించి కూడా మాట్లాడుతూ.. ''మన గాళ్ ఫ్రెండ్ లేదా చెల్లెను ఎవరన్నా కామెంట్ చేస్తే అదే మాట వాడతాం. కాని ఏ సర్టిఫికేట్ ఇచ్చిన సెన్సార్ బోర్డు మాత్రం ఆ విషయం ఒప్పుకోవట్లేదు. అందుకే ఆ పదం మ్యూట్ చేశారు. నా వాయిస్ ఆపేశారు సరే.. ధియేటర్లో రేపు మీ (స్టూడెంట్స్) వాయిస్ ఆపలేరుగా. అందుకే ఆ పదం దగ్గర మీరు డబ్బింగ్ చెప్పండి'' అని చెబుతూ.. మనోడు ''ఎవడ్రా వాడు..'' అని అరిచి.. స్టూడెంట్లతో ''మా...ద్'' అనే బూతును పలికించాడు. ఇదేదో పరాకాష్టకు చేరిన యవ్వారంలా ఉంది కదూ.
మొత్తానికి అంత పెద్ద ఆడియన్స్ ను చూసేపాటికి కాస్త సంయమనం కోల్పోయాడో లేకపోతే తాను ఆల్రెడీ సూపర్ స్టార్ అయిపోయాను అనుకున్నాడో తెలియదు కాని.. విజయ్ దేవరకొండ మాత్రం కాస్త శృతిమించేశాడు. నిజానికి పెద్ద పెద్ద హీరోలు నటులు ఎవ్వరూ కూడా ఒక పబ్లిక్ ఫంక్షన్లో ఇలా f*ck అంటూ బూతులు మాట్లాడరు. ఆ లిమిట్ క్రాస్ చేసి సొసైటీకి ఏం మెసేజ్ ఇద్దామనుకున్నాడో అతనికే తెలియాలి.