Begin typing your search above and press return to search.

ఇదొక బ్లడి గుడ్ ఫిల్మ్

By:  Tupaki Desk   |   6 Aug 2017 4:39 AM GMT
ఇదొక బ్లడి గుడ్ ఫిల్మ్
X
పెళ్లి చూపులు సినిమాతో ఎవరు ఊహించని విధంగా హిట్ కొట్టిన సరికొత్త కథానాయకుడు విజయ్ దేవరకొండ. తన ప్రతి సినిమాకి ఎదో ఒక కొత్త ధనాన్ని పరిచయం చేస్తున్న ఈ యంగ్ హీరో తనదైన శైలిలో కథలను ఒకే చేస్తున్నాడు. ఈ తరం కొత్త దర్శకుల ప్రతిభనే నమ్ముకొని ఎవ్వరు చేయలేని ప్రయోగాలను చేస్తున్నాడు. ఈ ఏడాది మార్చ్ లో ద్వారక సినిమాతో ఫ్లాపు టేస్ట్ చేసిన ఈ హీరో ఇప్పుడు అర్జున్ రెడ్డితో ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని ఇవ్వబోతున్నట్లు చెప్పాడు.

టీజర్ తో ఫస్ట్ లుక్ తో ఆసక్తిని రేపిన "అర్జున్ రెడ్డి" సినిమా ఇప్పుడు ట్రైలర్ తో మరింత ఆసక్తిని రేపుతోంది. ఇప్పటికే ఓ వర్గం ప్రేక్షకులని ఈ సినిమా చాలా వరకు ఆకర్షించింది. అయితే నిన్న ట్రైలర్ లాంచ్ చేసిన చిత్రం యూనిట్ ఈ నెల 25న సినోమాను రిలీజ్ చేయబోతున్నట్లు చెప్పింది. ఇక అర్జున్ రెడ్డిగా ఈ సినిమాలో నటించిన విజయ్ దేవరకొండ మరోసారి తన మాటలతో ఆకర్షించాడు. ''మూడు నిమిషాల ట్రైలర్ అదిరిపోయింది.. ఇంకొంచెం ఉంటే బావుండు.. అందరూ దానికోసమే ఎదురు చూస్తున్నారు.. ఇందుకే సూసైడ్ ల లాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయని చెప్పాడు. అలాగే ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని.. తన అకౌంట్ లో ఎన్ని డబ్బులు ఉన్నాయో అన్ని డబ్బులతో బెట్టింగ్ వేస్తా...అని ఛాలెంజ్ విసిరాడు. కొంచెం లేట్ అయినా మంచి సునిమాతో రాబోతున్నట్లు చెప్పాడు. అంతే కాకుండా ఇది ఒక బ్లడీ గుడ్ ఫిల్మ్ అని చెబుతూ.. ఈ సినిమాతో ఒక నటుడిగా చాలా సంతృప్తి పొందానని చెప్పాడు విజయ్.

మరి ఇంత కాన్ఫిడెన్స్ గా ఉన్న విజయ్ అర్జున్ రెడ్డి సినిమాతో ఏ స్థాయిలో అలరిస్తాడో చూడాలి. కొత్త దర్శకుడు సందీప్ రెడ్డి రూపొందించిన ఈ సినిమాలో ప్రేమ అనే ఎమోషన్ ను ఇంటెన్స్ గా చెపా్పరటలే. వెయిట్ అండ్ సి.