Begin typing your search above and press return to search.
ఇప్పుడే మొదలు పెట్టి అప్పుడే చివరిదా రౌడీ?
By: Tupaki Desk | 7 Feb 2020 6:26 AM GMTవిజయ్ దేవరకొండ.. క్రాంతి మాధవ్ ల కాంబోలో తెరకెక్కిన వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం ట్రైలర్ నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాలుగు విభిన్నమైన ప్రేమ కథలను ఈ చిత్రంలో దర్శకుడు చూపించబోతున్నట్లు గా ట్రైలర్ చూస్తుంటే అర్థం అవుతుంది. ఒక్కో ప్రేమ కథ ఒక్కో విధంగా చాలా వినూత్నం గా ఈ చిత్రం లో దర్శకుడు క్రాంతి మాధవ్ చూపించాడంటూ చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. తాజాగా ట్రైలర్ విడుదల కార్యక్రమం లో హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
నా సినీ కెరీర్ లో ఇదే నా చివరి ప్రేమ కథ చిత్రం అయ్యి ఉండవచ్చు అన్నాడు. మళ్లీ ప్రేమ కథ సినిమాల్లో చేస్తానో లేదో తెలియదు. ఒక మంచి సినిమా చేశానంటూ విజయ్ దేవరకొండ పేర్కొన్నాడు. యంగ్ హీరోలంతా కూడా లవ్ స్టోరీ చిత్రాల వెనుక పరిగెడుతూ ఉంటే విజయ్ దేవరకొండ వచ్చి కొంతకాలం కూడా కాకుండానే అప్పుడే ఇదే నా చివరి లవ్ స్టోరి చిత్రం అంటూ చెప్పడం ఆశ్చర్యం గా ఉందంటూ ఫ్యాన్స్ అంటున్నారు.
విజయ్ దేవరకొండ తన అభిప్రాయం ను మార్చుకుంటే మంచిదంటూ సినీ విశ్లేషకులు సలహా ఇస్తున్నారు. కెరీర్ ఆరంభంలో మంచి లవ్ స్టోరీ చిత్రాలను చేయడం వల్లే యూత్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవ్వొచ్చు. అందుకే ముందు ముందు కూడా విజయ్ దేవరకొండ మరిన్ని లవ్ స్టోరీ సినిమాలు చేయాలని కోరుకుంటున్నాం అంటూ ఆయన అభిమానులు వ్యాఖ్యలు చేస్తున్నారు. లవ్ స్టోరీస్ చేయకుండా అప్పుడే యాక్షన్ సినిమాలు చేస్తావా రౌడీ అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.