Begin typing your search above and press return to search.

విజ‌య్ నోట పూరి త‌ర‌హా పాఠాలు!

By:  Tupaki Desk   |   20 Sep 2022 6:11 AM GMT
విజ‌య్ నోట పూరి త‌ర‌హా పాఠాలు!
X
రౌడీస్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయుడిగా పూరి జ‌గ‌న్నాధ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన 'లైగ‌ర్' భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయి ఎలాంటి ఫ‌లితాలు సాధించిందో తెలిసిందే. ఒక్క ప్ర‌తికూల ఫ‌లితం విజ‌య్ ని ఒక్క‌సారిగా డౌన్ చేసింది. రిలీజ్ కు ముందు చూద్దాం..చూసుకుందాం? వంటి వ్యాఖ్య‌లు చేసిన హీరోనోట ఇప్పుడు పూరి త‌ర‌హాలో పాఠాలు వ‌ల్లిస్తున్నారు.

క‌ష్ట‌ప‌డి ప‌నిచేయండి. మిమ్మ‌ల్ని మీరు పుష్ చేసుకోండి. నైపుణ్యాల వైపు దృష్టి సారించండి. త‌ప్పుల నుంచి పాఠాలు నేర్చుకోండి. విజ‌యాన్ని ఆస్వాదించండి. మీకు న‌చ్చిన‌ట్లు జీవించండని ఇన్ స్టాలో వీడియో పోస్ట్ చేసాడు. అలాగే లైగ‌ర్ పాత్ర కి సంబంధించిన ట్రైనింగ్ వీడియోని పోస్ట్ చేసి త‌న క‌మిట్ మెంట్..డెడికేష‌న్ లెవ‌ల్స్ గురించి చెప్ప‌క‌నే చెప్పాడు.

దీంతో విజ‌య్ ఫ్యాన్స్ స్పందించారు. విజ‌య్ ఫ్యాన్స్ లో స్పూర్తిని నింపాల‌ని ట్రైచేస్తే..అభిమానులు మాత్రం ఆయ‌న్ని ఓదార్చిన‌ట్లు క‌నిపిస్తుంది. 'అన్నా మీరే మాస్పూర్తి. నువ్వు త‌గ్గొద్దు..అనుకున్న‌ది త్వ‌ర‌లోనే రీచ్ అవుతావంటూ కామెంట్లు పోస్ట్ చేసారు. గ‌తంలో ఎప్పుడు విజ‌య్ ఇలా స్పందించింది లేదు. పూరి కాంపౌండ్ లో కాలు పెట్టిన త‌ర్వాత విజ‌య్ లో మార్పులొచ్చాయి.

డ్యాషింగ్ డైరెక్ట‌ర్ త‌ర‌హాలోనే త‌న‌లోనూ డేరింగ్ నెస్ ని చూపిస్తున్నాడు. మాట తీరు మారింది. ప్రవ‌ర్త‌నా విధానంలో మార్పులొచ్చాయి. మీడియా ముందు టేబుల్ పై కాళ్లు చాపుకుని మాట్లాడ‌టం వంటి స‌న్నివేశాలు విజ‌య్ పై మీడియా స‌హా ప్రేక్ష‌కుల్లో వ్య‌తిరేక‌త‌ను తీసుకొచ్చాయి.

ఓ థియేట‌ర్ య‌జ‌మాని ప‌బ్లిక్ గానే విజ‌య్ యాటిట్యూడ్ పై మండిప‌డ్డాడు. ప్ర‌తిగా ముంబై వెళ్లి అత‌నికి విజ‌య్ సారీ చెప్పాడు. కామ్ గోయింగ్ అనుకున్న కుర్రాడు కామ్ లెస్ అనిపిస్తున్నాడంటూ నెగిటివ్ కామెంట్లు తెర‌పైకి వ‌చ్చాయి.

తాజా వీడియో వెనుక ఏదైనా అంత‌రార్ధం ఉందా? అంటూ కొంద‌రు నెటి జ‌నులు సందేహం వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రి విజ‌య్ పాఠాల్ని అభిమానులు ఎలా తీసుకుంటారో చూడాలి. ప్ర‌స్తుతం విజ‌య్ ఖుషీ సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. అలాగే పూరి తెర‌కెక్కించాల్సిన మ‌రో ప్రాజెక్ట్ 'జ‌న‌గ‌ణ‌మ‌న' మ‌ధ్య‌లోనే ఆపేసిన సంగ‌తి తెలిసిందే.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.