Begin typing your search above and press return to search.
లైగర్.. పుష్ప కాంబో పై ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు
By: Tupaki Desk | 21 Aug 2022 2:30 AM GMTకరోనా వల్ల ఎన్నో సినిమాలు రీ షెడ్యూల్ అయ్యాయి.. కొన్ని సినిమా లు క్యాన్సిల్ కూడా అయ్యాయి. కరోనా ముందు విజయ్ దేవరకొండ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా అధికారికంగా ప్రకటన వచ్చిన విషయం తెల్సిందే.
వీరిద్దరి కాంబోలో సినిమా అనగానే అంతా కూడా నోరు వెళ్లబెట్టారు. విజయ్ దేవరకొండ ను సుకుమార్ ఎలా చూపిస్తాడా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూశారు.
ఇంతలో కరోనా వల్ల రెండేళ్ల సమయం పాటు సినిమా గురించిన చర్చే లేకుండా పోయింది. ఇప్పుడు పుష్ప తో సుకుమార్ బిజీ అయ్యాడు. మరో వైపు విజయ్ దేవరకొండ లైగర్.. ఖుషి మరియు జనగనమణ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్ లకు సైన్ చేశాడు. ఎప్పటికి రౌడీ స్టార్ ఖాళీ అవుతాడో అర్థం కాని పరిస్థితి.
ఈ పరిస్థితుల్లో సుకుమార్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ సినిమా అంటే దాదాపుగా అసాధ్యం అనే అభిప్రాయం ను కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఆ సినిమా గురించి మర్చి పోవాల్సిందే అనుకుంటుంటున్న సమయంలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు.
సుకుమార్ తో తన ప్రాజెక్ట్ ఉందని లైగర్ సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ స్పష్టంగా ప్రకటించాడు. పుష్ప 2 సినిమా పూర్తి చేసి విడుదల చేసిన తర్వాత సుకుమార్ తో తన సినిమా ఉంటుందని పేర్కొన్నాడు. అది 2023 చివర్లో ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయూని కూడా విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు.
ఇప్పటికే లైగర్ సినిమా విడుదలకు సిద్ధం అయ్యింది. ఖుషి సినిమా ను అతి త్వరలోనే పూర్తి చేయబోతున్నారు. లైగర్ హడావుడి పూర్తి అయిన వెంటనే జనగనమణ సినిమా ప్రారంభించే అవకాశం ఉంది. వచ్చే ఏడాది సమ్మర్ లేదా ఆ తర్వాత వరకు విజయ్ దేవరకొండ ప్రస్తుతం కమిట్ అయిన సినిమాలన్నీ కూడా పూర్తి చేసే అవకాశం ఉంది. అందుకే వచ్చే ఏడాది ద్వి తీయార్థం లో సుకుమార్ సినిమా ను మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి.